తెలంగాణను (HYD) ప్రపంచ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) స్పష్టం చేశారు. గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌లో జ్ఞానాన్ని పంచుకోవడం (నాలెడ్జ్ షేరింగ్), నైపుణ్య శిక్షణ (స్కిల్ ట్రైనింగ్)కే అధిక ప్రాధాన్యం ఉంటుందని, కేవలం లాభార్జన ధ్యేయంగా ఉండే విద్యా వ్యవస్థ ఉండబోదని మంత్రి తెలిపారు. సోమవారం ప్రారంభమైన ‘తెలంగాణ రైజింగ్ (Telangana Rising) -2047’ విజన్‌లో భాగంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడంలో వైద్య, విద్యారంగాలే వెన్నముకగా నిలుస్తాయన్నారు. గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా “తెలంగాణ యాజ్ ఏ గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్” అనే అంశంపై జరిగిన చర్చా వేదికలో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రసంగించారు.
Read Also: Bhatti Vikramarka: సమ్మిళిత వృద్ధి కోసం దీర్ఘకాలిక చర్యలు

బాలికా విద్యకు ప్రాధాన్యం
బాలికా విద్యకు పెద్దపీట వేస్తూ, దాని ప్రాముఖ్యతపై మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చే అమ్మాయిలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి నర్సింగ్ వంటి వృత్తి విద్యా కోర్సులు ఎంతో దోహదపడతాయని, వారి కలలను సాకారం చేసేందుకే తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది కొత్తగా 16 నర్సింగ్ కళాశాలలు ప్రారంభించిందన్నారు. కేవలం డిగ్రీలు ఇవ్వడమే కాదని, అంతర్జాతీయ స్థాయిలో వారికి ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం నర్సింగ్ విద్యార్థులకు జర్మన్, జపనీస్, ఇంగ్లిష్ భాషల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, తద్వారా తెలంగాణ ఆడబిడ్డలు విదేశాల్లోనూ రాణించేలా తీర్చిదిద్దుతున్నామని మంత్రి స్పష్టం చేశారు.
నైపుణ్యం ఆధారిత విద్య ఆవశ్యకత
నైపుణ్యంతో కూడిన విద్యే అసలైన ఆస్తి అని, సామాన్యుడి ఆశయ సాధనకు విద్యే ప్రధాన ఆయుధమన్నారు. ప్రస్తుత ప్రపంచంలో కేవలం పుస్తక జ్ఞానం ఉంటే సరిపోదని, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మిళితమైన విద్య అవసరమని తెలిపారు. అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 47 విశ్వవిద్యాలయాలు, 1,951 ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయని, దేశంలోనే అత్యధిక కళాశాల సాంద్రత కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని మంత్రి వెల్లడించారు. అలాగే, గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియోలో తెలంగాణ దేశంలోని టాప్ 5 రాష్ట్రాల్లో నిలిచిందని తెలిపారు.
ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంస్కరణలను మంత్రి వివరిస్తూ, సామాజిక అసమానతలను తొలగించి, అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (వైఐఐఆర్ఎస్)ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఆస్ట్రియాకు చెందిన ఆల్పా సంస్థతో కలిసి డ్యుయల్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రాము అమలు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 2047 నాటికి ప్రతి పౌరుడిని నైపుణ్యవంతుడిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తుందని, ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు, విద్యావేత్తలకు మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న నిపుణులు ఇచ్చిన సూచనలను తప్పకుం
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: