‘చైనా మంజా’ను పూర్తిగా బహిష్కరించాలని సజ్జనార్ పిలుపునిచ్చారు. చైనా మంజా విక్రయాలు, వాడకంపై హైదరాబాద్ (HYD) పోలీస్ యంత్రాంగం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తుందని ఆయన స్పష్టం చేశారు. సాధారణ నూలు దారానికి బదులుగా నైలాన్ లేదా సింథటిక్ పదార్థంతో తయారు చేసి, గ్లాస్ కోటింగ్ ఇచ్చే ఈ చైనా మంజా ఒక నిశ్శబ్ద హంతకిగా మారిందని.. ఇది కేవలం పక్షులకే కాదు, మనుషులకు కూడా ప్రాణాంతకంగా పరిణమిస్తోందన్నారు.
Read also: Telangana Assembly : ఎక్కడ నిలదీస్తామో అని బిఆర్ఎస్ సభ్యులు జారుకున్నారు – మంత్రి శ్రీధర్ బాబు
క్రిమినల్ కేసులు నమోదు
ముఖ్యంగా ఫ్లైఓవర్లపై వెళ్లే వాహనదారులు దీనివల్ల ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షుల రెక్కలు ఈ గట్టి దారం వల్ల తెగిపోతున్నాయన్నారు. ఏటా వేల సంఖ్యలో పావురాలు, గద్దలు, ఇతర అరుదైన పక్షులు ఈ మంజా ఉచ్చులో చిక్కుకుని విలవిలలాడుతూ ప్రాణాలు వదులుతున్నాయని చెప్పారు.

ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి ముప్పుగా మారిన చైనీస్ మాంజాపై పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. మాంజాను విక్రయించినా, నిల్వ ఉంచినా చట్టపరమైన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఎక్కడైనా విక్రయాలు కనిపిస్తే వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని లేదా వాట్సాప్ నంబర్ 9490616555కు సమాచారం ఇవ్వాలని కోరారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: