గత రబీతో పోల్చితే రూ.430 పెరుగుదల
హైదరాబాద్: HYD రాష్ట్రంలో ప్రస్తుత రబీ సీజన్‌లో రైతులకు ఎరువుల సరఫరా ఒక సవాలుగా నిలుస్తోంది. ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల కొరతతో అష్టకష్టాలు పడ్డ రైతులకు ప్రస్తుత రబీపై ఆందోళన తప్పడం లేదు. ఈ రబీ సీజనులో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Read Also: R. Krishnaiah: 42 శాతం రిజర్వేషన్ కల్పించాకే ఎన్నికలు జరపాలి

ఎరువుల ధరల పెరుగుదల, ఆర్థిక భారం
గత ఖరీఫ్‌లోనే ఎరువుల ధరలు భారీగా పెరగ్గా, ఇప్పుడు ఈ రబీలోనూ మరోసారి పెరిగాయి. ఎరువుల రకాన్ని బట్టి ఒక్కో రకంపై రూ.50 నుంచి రూ.100 వరకు పెరిగాయి. పెరిగిన ఎరువుల ధరలు రైతులకు ఆర్థికంగా మరింత భారం కానున్నాయి. తెలంగాణ రైతులపై వందలాది కోట్ల రూపాయల భారం పడుతున్నది. కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా వాడే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చూస్తే యాసంగిలోనే రైతులపై రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని అంచనా.
గత ఖరీఫ్‌లోనే ఎరువుల ధరలను పెంచుకునేందుకు కేంద్రం అనుమతించింది. ఇప్పుడు యాసంగిలో మళ్లీ ధరలు పెంచారు. ఒక్కో ఎరువుపై ఏడాదిలోనే 15 నుంచి 30 శాతం వరకు ధరలు పెరగ్గంతో రైతులపై మోయలేని భారం అయింది. ఒక్కో రైతుపై సగటున ఒక పంటకు ఏడాదికి రూ.2 వేల నుండి రూ.3 వేల వరకు అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. గత యాసంగి ధరలతో పోలిస్తే ప్రస్తుతం ఒక్కో కాంప్లెక్స్ ఎరువు బస్తాపై రూ.150 నుంచి రూ.430 వరకు ధర పెరిగింది. యూరియా మినహా అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల ధరల పెరుగుదల చోటు చేసుకుంది.
వివిధ కాంప్లెక్స్ ఎరువుల ధరలు
డీఏపీ ధర ప్రస్తుతం పాత ధర 50 కిలోల బస్తాకు రూ.1,350 అలాగే ఉంది. మిగతా ఎరువుల బస్తాలపై రూ.25 నుంచి రూ.100 వరకు పెరిగాయి.
- 20:20:13: ప్రస్తుతం రూ.1,350 ఉండగా, అది రూ.1,400లకు చేరింది.
- 14:35:14: ప్రస్తుతం రూ.1,850 ఉండగా, అది రూ.1,900లకు చేరింది.
- 10:26:26: ప్రస్తుతం రూ.1,800 నుంచి రూ.1,825లకు చేరింది.
- 20:20:0.13: రూ.1,300 నుంచి రూ.1,375లకు.
- 24:24:00: రూ.1,800 నుంచి రూ.1,900లకు.
- 16:16:0: రూ.1,600 నుంచి రూ.1,650లకు పెరిగింది.
యాసంగిలో కాంప్లెక్స్ ఎరువుల వినియోగం ఎక్కువగానే ఉంటుంది. దీంతో రైతులకు అదనంగా కోట్ల రూపాయల భారం పడుతోంది.
రబీ సీజన్ సాగు అంచనాలు, ఎరువుల అవసరాలు
ప్రస్తుత రబీ సీజనులో తెలంగాణ (Telangana) వ్యాప్తంగా సాధారణ విస్తీర్ణం 63.55 లక్షల ఎకరాలు కాగా, 80 లక్షల ఎకరాలకు పైగా సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా. ఈ రబీలో సాగు కోసం అన్ని రకాల ఎరువులు కలిపి దాదాపు 19.60 లక్షల టన్నుల వరకూ అవసరం అవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో ప్రధానంగా 9.8 లక్షల టన్నుల యూరియా, 1.6 లక్షల డీఏపీ, 7 వేల టన్నుల ఎంపీపీ, కాంప్లెక్స్ 7 వేల టన్నులు, ఎంఎస్పీ 6 వేల టన్నులు చొప్పున అవసరం అవుతుందని లెక్కకట్టారు. ఈ నేపథ్యంలో పెరిగిన ఎరువుల ధరలు మరింత ఆర్థిక భారం అయిందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: