రంగారెడ్డి జిల్లా కొహెడలో హైదరాబాద్ వాసులకు తక్కువ ధరకే తాజా చేపలను అందించడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 13 ఎకరాల అంతర్జాతీయ ఫిష్ ఎగుమతి కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు రూ.47 కోట్లు ఖర్చు చేయనున్నారు. రాష్ట్ర మత్స్య మంత్రి వాకిటి శ్రీహరి ఈ కేంద్రం మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని, హైదరాబాద్ నగరానికి తాజా మరియు తక్కువ ధరలో చేపలు అందుతాయని తెలిపారు. కొహెడలోని సర్వే నం.167లో నిర్మాణం ప్రారంభమయ్యే ఈ హబ్, మద్యవర్తుల అవసరాన్ని తగ్గించి, నేరుగా వినియోగదారులకు ఫిష్ అందించనుంది. ఈ కేంద్రంలో అత్యాధునిక కోల్డ్ స్టోరేజ్, ప్యాకేజింగ్ యూనిట్లు ఏర్పాటు చేయబడతాయి.
Read also: Draupadi Murmu: పుస్తకాన్ని విడుదల చేసిన ద్రౌపతి ముర్ము

An international-level fish market in Koheda
ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత, హైదరాబాద్ మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల కృష్ణా, గోదావరి బేసిన్లకు చెందిన మత్స్య ఉత్పత్తులు కూడా ఇక్కడికి చేరుతాయి. దాదాపు 26,000 చెరువుల నుంచి చేపలు ఈ కేంద్రంలో చేరుతాయి, తద్వారా మత్స్యకారులు తగిన ధరలో తమ ఉత్పత్తిని విక్రయించగలుగుతారు.
స్థానిక ఉపాధి అవకాశాలు
ఫిష్ హబ్ వల్ల లోడింగ్, అన్‌లోడింగ్, ప్యాకేజింగ్, రవాణా వంటి రంగాల్లో వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తోంది. ఈ హబ్, దక్షిణ భారతదేశంలో ప్రత్యేకమైన మత్స్య వాణిజ్య కేంద్రంగా మారుతుందని అధికారులు నమ్ముతున్నారు. నగర వాసులు తక్కువ ధరలో ప్రొటీన్లతో సంపూర్ణ ఆహారం అందుకోవడం సులభమవుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: