‘ఓజీ’ సినిమా (OG Movie) టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పిస్తూ, ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై దాఖలైన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు (Telangana High Court)సస్పెండ్ చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ డీవీవీ నిర్మాణ సంస్థ వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. గతంలో ఇచ్చిన తీర్పు కొనసాగుతుందని మరోసారి హైకోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు.
Dulquer Salmaan:కారు సీజ్ చేయడంతో కేరళ హైకోర్టును ఆశ్రయించిన దుల్కర్

నచ్చినట్లు పెంచుతూ పోతే ఎలా?
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు మీకు నచ్చినట్లు టికెట్ రేట్లు (Ticket rates) పెంచుతూ పోతే ఎలా? గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేయరా? టికెట్ ధరలను నియంత్రిస్తూ విడుదలైన జీవో 120ని ఎందుకు అమలు చేయడం లేదంటూ హైకోర్టు ప్రభుత్వం (Govt) పై ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్ ధరల గురించి ఎన్ని పిటిషన్లు వేసినా, ఎందుకు ఒక్క కౌంటర్ కూడా దాఖలు చేయడం లేదు? ఈ సారి కచ్చితంగా కౌంటర్ దాఖలు చేయాల్సిందే అంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: