హైదరాబాద్ : ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి(IAS Amrapali) తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఆమ్రపాలిని ఏపీకి కేటాయిస్తూ అక్టోబర్లో కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని ఆమె క్యాట్లో సవాల్ చేయగా ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఆదేశాలు జారీచేసింది.
Read Also: Grama Panchayat Elections : పంచాయతీ ఎన్నికల్లో వారే అధికం!

హై-కోర్టు ఉపశమన నిర్ణయం
ఆ ఉత్తర్వులను డీవోపీటీ మళ్లీ హైకోర్టు(High Court)లో అప్పీల్ చేయగా విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్ర విభజన నేపథ్యంలో తనను ఏపీ పర్యాటక క్యాడర్కు కేటాయిస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆమ్రపాలి క్యాట్లో పిటిషన్ దాఖలు చేశారు.
ఆమెను ఏపీ క్యాడర్కు పంపడంతో అక్కడ జాయిన్ అయి విధులు నిర్వహిస్తూనే క్యాట్ను ఆశ్రయించారు. ఆ సమయంలో ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమ్రపాలి పిటిషన్పై క్యాట్ జ్యుడిషియల్ సభ్యురాలు లతా బస్వరాజ్ పట్టే, పరిపాలనా సభ్యురాలు వరుణ్ సింధు కుల్ కౌముదిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: