తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరుగుతున్న ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలోని చెరువుల వద్ద నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైకోర్టు (High Court), సుప్రీం కోర్టులు వరుసగా గంభీర వ్యాఖ్యలు చేస్తూ, ప్రభుత్వానికి తగిన రీతిలో హెచ్చరికలు జారీ (Issue warnings) చేస్తున్నాయి. చట్టబద్ధత, ప్రక్రియలు పాటించకుండా తక్షణమే కూల్చివేత చర్యలు చేపట్టడం న్యాయపరంగా సమర్థించదగినది కాదని స్పష్టం చేస్తున్నాయి.

పిటిషనర్ల వాదనలు
తనకు తానుగా అక్రమ నిర్మాణమని నిర్ధారించి కూల్చివేయడం సరికాదంది. తాజాగా సున్నం చెరువు ఎఫ్టీఎల్ను నిర్ధారించకుండా ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా, సర్వే నిర్వహించకుండా అక్రమ నిర్మాణాల పేరుతో హైడ్రా కూల్చివేత (Hydra demolition) చర్యలు చేపట్టింది. దీనిని సవాలు చేస్తూ ఎస్ఐఈటీ మారుతి హిల్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మరో ఆరుగురు హైకోర్టు (High Court) లో పిటిషన్ దాఖలు చేశారు.
న్యాయస్థానాల స్పష్టత
హైకోర్టు జస్టిస్ సి.వి. భాస్కర్ రెడ్డి (C.V. Bhaskar Reddy) మాట్లాడుతూ –పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం.వి.దుర్గాప్రసాద్ వాదనలు వినిపిస్తూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా జోక్యం చేసుకుంటోందని తెలిపారు. హైడ్రా తరఫు న్యాయవాది కౌటూరి పవన్‌కుమార్ వాదనలు వినిపించారు. శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేట సర్వే నం 12,13 అల్లాపూర్ సర్వే నం.31లో పిటిషనర్లతో పాటు దాని ప్రభావం ఉన్న అందరికీ నోటీసులు జారీ చేసి సర్వే నిర్వహించాలంటూ మార్చిలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
బోర్ల ద్వారా నీటి సరఫరా – హైకోర్టు ఆదేశాలు
ఈ ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని పిటిషనర్లు ఈ సర్వే నంబర్లలోని బోర్ల నుంచి కలుషిత నీటిని ట్యాంకర్ల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్నారన్నారు. వర్షాకాలం వస్తున్నందున చెరువులను పునరుద్ధరించాల్సి ఉందని లేదంటే లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతాయన్నారు. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, ఇవన్నీ అక్రమ నిర్మాణాలైనా తొలగించడానికి ఓ విధానం ఉందని వ్యాఖ్యానించారు.
విచారణ వాయిదా
ప్రస్తుతం యథాతథస్థితి కొనసాగించాలంటూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రాంతంలోని బోర్ల నుంచి పిటిషనర్లు నీటిని తరలిస్తుంటే ఆ వాహనాలను సీజ్ చేయాలని, వాటిని విడుదల చేయరాదని ఆదేశించారు. గుట్టలబేగంపేటలోని ఉన్న సర్వే నం.12,13, అల్లాపూర్ సర్వే నం.31కి సంబంధించి డాక్యుమెంట్లను పిటిషనర్లు సమర్పించారు. అక్కడ అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాత వివాదం లేని పక్షంలో చెరువు పునరుద్ధరణ పనులకు అనుమతి కోరుతూ హైకోర్టుకు దరఖాస్తు చేయాలని హైడ్రాకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సర్వే నంబర్లలో యథాతథస్థితిని కొనసాగించాలంటూ విచారణను ఈనెల 17కు వాయిదా వేశారు.
అంశంపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు
సుప్రీం కోర్టు కూడా ఇటీవలి విచారణలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉద్దేశిస్తూ,
మీకంటూ ఓ పద్ధతి లేదా? చట్టబద్ధతతో వ్యవహరించాలి. ప్రజల హక్కులను పరిగణనలోకి తీసుకోకుండా అన్యాయంగా కూల్చివేతలు సరైనవి కావు. అంటూ గట్టిగా హెచ్చరించింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Ramachander Rao: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచందర్‌రావు