హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు(High Court) నోటీసులు జారీ చేసింది. పలువురు ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ కేడర్లోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శిఖా గోయెల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర వంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ కేడర్ లో ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది.
Read Also: Hyderabad Expansion: GHMC భారీ విస్తరణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్

1342 ప్రకారం పలువురు ఐపీఎస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26వ తేదీన విడుదల చేసిన జీవో 1342 ప్రకారం పలువురు ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించిందని వడ్ల శ్రీకాంత్ హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు. ఈ జీవో చట్టవిరుద్ధమని దీనిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ న్యాయమూర్తి సూరేపల్లి నంద ధర్మాసనం విచారణ చేప ట్టింది.
ఈ పిటిషన్ విచారిస్తూ శిఖా గోయెల్, సీవీ ఆనంద్(CV Anand), స్టీఫెన్ రవీంద్ర వంటి ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా ఎందుకు కల్పించారో చెప్పాలని ప్రశ్నించింది. దీనిపై డిసెంబర్ 10వ తేదీలోపు వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: