తెలంగాణ (Telangana) లో వర్షాలపై మరోసారి వాతావరణ శాఖ అధికారుల కీలక హెచ్చరిక వెలువడింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా నివేదిక ప్రకారం, రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow alert) కూడా ప్రకటించింది.
Telangana: తెలంగాణలో పత్తి రైతులకు సర్కార్ శుభవార్త
ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడవచ్చని అధికారులు తెలిపారు.దక్షిణ కర్ణాటక నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు తమిళనాడు (Tamil Nadu) అంతర్భాగంగా సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది.

తమిళనాడు తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతం (Southwest Bay of Bengal) లో సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని దాని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా నేడు వర్షాలు కురుస్తాయని చెప్పారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు
ప్రధానంగా భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: