యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District) చౌటుప్పల్ మండలంలో సోమవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షం కారణంగా స్థానికులకు భారీ ఆస్తి, పంట నష్టం జరిగింది. చౌటుప్పల్ మండలంలోని పెద్దకొండూరు గ్రామ పంచాయతీ పరిధిలోని నక్కలగూడెం గ్రామంలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.
Konda Lakshma Reddy: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత
ఇక్కడ ఉన్న కోళ్లఫారంలోకి భారీగా వర్షపు నీరు ఒక్కసారిగా చేరింది. దీంతో ఫారంలో ఉన్న సుమారు 6 వేల కోళ్లు (Chickens) నీట మునిగి మృతిచెందాయి. ఈ ఘటనతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని కోళ్లఫారం యజమాని యాదిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.కోళ్లఫారాని (Chicken form) కి నష్టం వాటిల్లడంతో పాటు, మండల వ్యాప్తంగా విస్తారంగా సాగు చేసిన వరి, పత్తి పంటలు పెద్ద ఎత్తున నీట మునిగిపోయాయి.

చేతికొచ్చే సమయంలో పంటలు నీటిలో మునిగిపోవడంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. ఉధృతమైన వర్షానికి పొలాల్లో నీరు నిలిచిపోవడంతో పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు తక్షణమే ప్రభుత్వం తమను ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించి ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: