తెలంగాణ రాజకీయ వర్గాలను విషాదంలో ముంచెత్తిన వార్త ఇది. మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు టీ హరీశ్ రావు (Harish Rao) తండ్రి సత్యనారాయణ రావు గారు కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Read Also: Teacher Transfers: తెలంగాణ లో టీచర్ల బదిలీలకు భారీగా దరఖాస్తులు
ఈ వార్త తెలియగానే రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. సత్యనారాయణ రావు (Satyanarayana Rao) గారు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కాగా, ఆయన సాదాసీదా జీవన శైలితో అందరికీ ఆదర్శంగా నిలిచారు.

సత్యనారాయణ రావు గారి మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి
ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా సంతాప సందేశాన్ని విడుదల చేసింది. “మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు టీ హరీశ్ రావు గారి తండ్రి సత్యనారాయణ రావు గారి మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth reddy) గారు తీవ్ర సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. హరీశ్ రావు (Harish Rao)కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. హరీశ్ రావు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు పలువురు నేతలు సిద్ధమవుతున్నారు.సత్యనారాయణ రావు అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: