జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) గురువారం ఉదయం ఆకస్మికంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు లక్షణాలు కనిపించడంతో ఆయనను తక్షణమే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి(AIG Hospatal )కి తరలించారు. వైద్యులు ఆయనను అత్యవసర విభాగంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మొదటి సమాచారం ప్రకారం మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి తీవ్రమైనదిగా భావిస్తున్నారు. ఆస్పత్రి వర్గాలు త్వరలోనే అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు.
హరీష్ రావు ఏమన్నారంటే
మాగంటి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆస్పత్రికి చేరుకున్నారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆసుపత్రికి వచ్చి, మాగంటి పరిస్థితిపై వైద్యులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. ఆయనకు చికిత్స కొనసాగుతోంది. వైద్య బృందం నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారు” అని తెలిపారు.
హాస్పటల్ వద్ద టెన్షన్ ..టెన్షన్
బీఆర్‌ఎస్ పార్టీ నేతలు, మాగంటి అనుచరులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఉన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీ శ్రేణులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మాగంటి ఆరోగ్యంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. వైద్యుల ప్రకటన మేరకు వచ్చే సమయాల్లో మరిన్ని వివరాలు తెలియనుండగా, గోపీనాథ్ ఆరోగ్యంపై స్పష్టత కోసం అందరి దృష్టీ ఆసుపత్రి హెల్త్ బులిటెన్‌పైనే ఉంది.
Read Also : Chhattisgarh Bijapur Encounter : మావోయిస్ట్‌లకు మరో షాక్