కర్షకులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిరక్ష్యం
వరంగల్ సిటీ: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలు రైతుల నడ్డి విరిసే విధంగా ఉన్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు (Harish Rao) పేర్కొన్నారు. కాంగ్రెస్ ‘ప్రజాపాలన’ రైతులకు శాపంగా మారిందని ఆయన అన్నారు. జిన్నింగ్ మిల్లులు రెండు రోజులుగా మూతపడటంతో మంగళవారం వరంగల్ (Warangal) గ్రెయిన్ మార్కెట్‌ను స్థానిక నాయకులతో కలిసి ఆయన సందర్శించారు.
Read Also: Puttaparthi: సత్యసాయి సమాధి వద్ద PM Modi ప్రత్యేక పూజలు

రైతు సమస్యలు, కపాస్ యాప్‌పై ఆగ్రహం
రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, కరెంటు నుంచి కాంటా వరకు అన్నీ సమస్యలేనని హరీశ్ రావు విమర్శించారు. రైతాంగానికి సమయానికి ఎరువులు అందవని, కరెంట్ సరిగా రాదని, రైతుబంధు, రుణమాఫీ, బోనస్, పంటల బీమా ఊసే లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
- పత్తి కొనుగోళ్లు: రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంపై రైతులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. కేంద్రం తీసుకున్న ‘కపాస్ యాప్’ నిర్ణయాలు రైతులపై భారం మోపుతున్నాయని, 8 నుండి 12 శాతం తేమ ఉండాలనే తుగ్లక్ నిర్ణయాలతో రైతులు రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. జిన్నింగ్ మిల్లులన్నీ రెండు రోజులుగా మూతపడటంతో రైతులు అయోమయంలో ఉన్నారని తెలిపారు.
సీఎంపై నిధుల ఆరోపణలు, బీఆర్‌ఎస్ హెచ్చరిక
సీఎం కేవలం కలెక్షన్లపై మాత్రమే కాకుండా, రైతులను పట్టించుకోవాలని హరీశ్ రావు హితవు పలికారు. తక్షణమే రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బోనస్‌ను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉండి ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదన్ చారి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: