నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ బాలిక వసతి గృహం (Girls Hostel) లో ఇటీవల చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, హరీశ్ రావు (Harish Rao) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆయన స్వయంగా పరామర్శించారు.

మాటలు కాదు.. చేతల్లో మార్పు అవసరం
హరీశ్ రావు (Harish Rao) మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు చెప్పడం కాదు.. చేతల్లో చూపించాల్సిన సమయం వచ్చింది” అన్నారు. గతంలో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ (Food poisoning) ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి తక్షణ చర్యలు తీసుకుంటామంటూ ప్రకటనలు చేసినా, ఇటీవలి ఘటన చూపిస్తున్నది అధికార యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఢిల్లీకి సమయం ఉంది.. విద్యార్థుల కోసం లేదు?
“ఢిల్లీకి వెళ్లడానికి ముఖ్యమంత్రి గారికి సమయం దొరుకుతుంది.. కానీ విద్యార్థుల సమస్యలపై స్పందించడానికి మాత్రం సమయం కేటాయించరా?” అంటూ ప్రశ్నించారు హరీశ్ రావు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో రాజకీయాలకు తావు లేదని, ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై అసెంబ్లీలో చర్చ పెట్టాల్సిన అవసరం ఉందని హరీశ్ రావు డిమాండ్ చేశారు. మానవ హక్కుల సంఘం, హైకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని కోరారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని తేలికగా తీసుకోవడం అసహనంగా ఉందని పేర్కొన్నారు.
“మాపై కోపం ఉంటే జైల్లో పెట్టండి.. కానీ పిల్లల భవిష్యత్‌ను అడగొద్దు”
“మా మీద రాజకీయ కోపం ఉంటే, మమ్మల్ని జైలుకు పంపండి. కానీ అమాయక విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడకండి” అంటూ హరీశ్ రావు ఎమోషనల్‌గా స్పందించారు. విద్యార్థుల ఆరోగ్యానికి న్యాయం జరగాలన్నదే తమ ఆవేశం అని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజలు మర్చిపోలేరని అన్నారు.
Read hindi news: hindi.vaartha.com