తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన, ప్రస్తుతం నాగర్‌కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత ఆదివారం బాలరాజు బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో భేటీ అయినప్పటి నుండి ఆయన బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

బాలరాజు రాజీనామా లేఖలోని అంశాలు
గువ్వల బాలరాజు (Guvvala Balaraju) తన రాజీనామా (resignation) లేఖలో భావోద్వేగపూరితమైన అంశాలను ప్రస్తావించారు. సులభంగా ఈ నిర్ణయం తీసుకోలేదని, అనేక విషయాలను ఆలోచించిన తర్వాతే బాధతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రెండు దశాబ్దాలుగా పనిచేయడం తనకు గర్వంగా ఉందని, ఇలాంటి కష్ట సమయంలో పార్టీని వీడటం తనకు బాధగా ఉందని ఆయన తెలిపారు. 2014 నుండి 2023 వరకు అచ్చంపేట ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎన్నికయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: