నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) బీజేపీ (BJP) లో చేరారు. ఆదివారం నాడు హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కాషాయ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి గువ్వలతో పాటు ఆయన అనుచరులు, నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు హాజరై బీజేపీ సభ్యత్వం స్వీకరించారు.

బీఆర్ఎస్‌కి గుడ్‌బై.. కారణాలు ఇదే
కొన్ని రోజుల క్రితమే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తనపై జరిగిన దాడికి సంబంధించి పార్టీ నాయకత్వం స్పందించలేదని, తగిన ప్రాధాన్యం కల్పించకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో, ఆయన ఇక ఏ పార్టీలోకి వెళ్లబోతున్నారన్న చర్చకు తెరలేపి చివరకు బీజేపీలో చేరారు. దీంతో ఆయన్ను చుట్టుముట్టిన ఊహాగానాలకు ముగింపు లభించింది.
మోదీ నాయకత్వంపై నమ్మకంతో పార్టీలోకి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramachandra Rao) మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, దేశవ్యాప్తంగా బీజేపీ పెరుగుతున్న ప్రభావం చూసి గువ్వల బాలరాజు పార్టీ మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నారని వివరించారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడంలో ఆయన సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని వెల్లడించారు.
సీనియర్ నేతల నుంచి ఘన స్వాగతం
ఈ చేరిక కార్యక్రమానికి ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి సహా పలువురు సీనియర్ నేతలు హాజరై, గువ్వల బాలరాజుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చేరికతో బీజేపీకి కొత్త ఊపొచ్చిందని నేతలు పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: