తాము దిగిపోయే నాటికి రాష్ట్రం తలసరి ఆదాయంలో నం.1గా
హైదరాబాద్: కాళేశ్వరం వల్ల రాష్ట్రంలో వ్యవసాయ విస్తీర్ణం పెరిగిందని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించిన నివేదికలో ఇదే విషయాన్ని ప్రస్తావించారని మీడియా సమావేశంలో తెలిపారు. రేవంత్ ఏమైనా మాట్లాడే ముందు డిప్యూటీ సీఎం భట్టి ఇచ్చిన నివేదికను చదవాలని సూచించారు. తాము అధికారంలో ఉన్న పదేళ్లలో అనేక రంగాల్లో వృద్ధి జరిగిందని తెలిపారు. తాము దిగిపోయే నాటికి రాష్ట్రం తలసరి ఆదాయంలో నం.1గా ఉందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రికి ఇంకో విజ్ఞప్తి..
వాస్తవాలను అంగీకరించినందుకు భట్టికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సీఎం అయ్యాక కూడా ఆయన ప్రవర్తన మారడం లేదు. సీఎంకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా.. సొల్లు మాట్లాడేముందు అట్లాస్‌ను ఒకసారి చదవాలి. మీకు ఓపిక లేఎకపోతే మీ అడ్వైజర్లతో రిపోర్టు తెప్పించుకోండి. ఇది చేయకపోవడంతో రాష్ట్రం పరువు గంగలో కలుస్తుంది. ముఖ్యమంత్రికి ఇంకో విజ్ఞప్తి.. లంకె బిందెలు ఉంటాయనుకుని వచ్చానని అన్నారు. ఇక్కడేమో లంకె బిందెలు లేవు అన్నారు. లంకె బిందెలు ఉన్నాయి.. ఎక్కడ ఉన్నాయో అడ్రస్ చెబుతానని కేటీఆర్ తెలిపారు.
రాష్ట్ర సంపద ఎలా పెరిగిందో కూడా చెప్పింది
మన తలసరి ఆదాయం లక్షా 24 వేలు కానీ ఈ రోజు దేశ సగటు ఒక లక్షా 84 వేలకు పెరిగితే మనది రెండు రెట్లు అంటే 3 లక్షల 56 వేలు ఉందని ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది. కేసీఆర్ నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎలా పురోగమించింది.. దేశానికి దర్శంగా మారిందినే విషయాన్ని స్పష్టంగా వాస్తవాలను బయటపెట్టింది. ఇదే నివేదికలో రాష్ట్ర సంపద ఎలా పెరిగిందో కూడా చెప్పింది. దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా ఎలా సంపద సృష్టించిందో నివేదిక ఆవిష్కరించింది అని కేటీఆర్ తెలిపారు.