తెలంగాణ రాజకీయాల్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఫార్ములా–ఈ కార్ రేసు కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసు విచారణలో ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ను ప్రశ్నించేందుకు అవినీతి నిరోధక శాఖ (ACB) కి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది.

Read Also: Delhi Crime: టీచర్ల వేధింపులు తట్టుకోలేక..10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య
ఏసీబీకి అధికారిక అనుమతి
ప్రభుత్వం పంపిన ఫైలును గవర్నర్ సంతకం చేయడంతో విచారణకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది.గవర్నర్ అనుమతి లభించడంతో కేటీఆర్ (KTR) పై అభియోగాలు నమోదు చేసి, విచారణ చేపట్టేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు.
త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేసి, విచారణ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. విచారణ అనంతరం ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఏసీబీ (ACB) భావిస్తోంది. ఈ పరిణామంతో బీఆర్ఎస్ (BRS) వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: