తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం (Telangana government’s key decision) తీసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలకు ఇది ఊరట కలిగించే పరిణామం. ‘కొమురంభీమ్ కన్జర్వేషన్ కారిడార్’ పేరిట జారీ చేసిన జీవో 49 (GEO 49)ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.జీవో 49కు సంబంధించి ఆదివాసీ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళనలు సాగుతున్నాయి. అడవులు, ఆచార వ్యవస్థ, జీవనాధారం అన్నీ కలిసిన జీవితం వారికి. అయితే, ఈ జీవో అమలుతో తమ భూములు పోతాయన్న భయంతో వారు రోడ్డెక్కారు. ఈ అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డి పట్టించి, అధికారులను ఆ జీవోను నిలిపివేయమని ఆదేశించారు.

ముఖ్యమంత్రికి మంత్రి సీతక్క, తుడుం దెబ్బ అభినందనలు
జీవోను నిలిపివేసిన నేపథ్యంలో, మంత్రి సీతక్కతో పాటు ఆదివాసీ నేతలు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఆదివాసీల అభిప్రాయాలను గౌరవించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ప్రజల గొంతును వినడంలో రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవడం ప్రశంసనీయం.
మూడున్నర లక్షల ఎకరాల భూమి కారిడార్‌లోకి?
జీవో 49 ప్రకారం, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మూడు లక్షల ఎకరాల అటవీ భూమిని కన్జర్వేషన్ కారిడార్‌గా మార్చే ప్రణాళిక ఉంది. అధికారికంగా పర్యావరణ పరిరక్షణ పేరుతో ఇది తెరపైకి వచ్చింది. కానీ, ఇది ఆదివాసీల జీవన విధానానికి ముప్పుగా మారుతుందని వారు చెబుతున్నారు.
వాటిని పునఃపరిశీలించే వరకు జీవో అమలు లేదు
ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆదివాసీ సమాజంలోని ప్రతిఒక్కరి అభిప్రాయం వినే వరకు జీవోను అమలులోకి తేనని. వారి జీవనావకాశాలకు భంగం కలగకుండా పునఃపరిశీలన జరుపుతామని పేర్కొంది. ఇది రాష్ట్రంలో ప్రజాప్రభుత్వ సంబంధాలను బలపరచే అడుగు.
Read Also : Chandrababu : 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులే టార్గెట్: చంద్రబాబు