हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Nikhat Zareen: నిఖత్ జరీన్‌కు స్వర్ణం.. అభినందనలు తెలిపిన ప్రముఖులు

Anusha
Latest News: Nikhat Zareen: నిఖత్ జరీన్‌కు స్వర్ణం.. అభినందనలు తెలిపిన ప్రముఖులు

భారత బాక్సింగ్‌లో తెలంగాణ తేజం నిఖత్ జరీన్‌ (Nikhat Zareen) , నిత్యం ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగుతున్న నిఖత్ జరీన్‌ తన సత్తా ఏంటో చూపించింది. దాదాపు ఇరవై నెలల విరామం తర్వాత గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో ఆమె స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు.

Read Also:  Nikhat Zareen: వరల్డ్ బాక్సింగ్ కప్‌లో నిఖత్ జరీన్ కు స్వర్ణం

51 కేజీల విభాగంలో అద్భుతమైన ప్రదర్శనతో విజేతగా నిలిచి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా నిఖత్‌ (Nikhat Zareen) పై రాజకీయ, క్రీడా ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), నిఖత్ జరీన్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

అంతర్జాతీయ వేదికపై మరోసారి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారని కొనియాడారు. నిఖత్ అసాధారణ విజయం యువతకు, వర్ధమాన క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తినిస్తుందని సీఎం పేర్కొన్నారు. ఆమె భవిష్యత్ ప్రయత్నాల్లోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

 Gold for Nikhat Zareen.. Celebrities congratulated her
Gold for Nikhat Zareen.. Celebrities congratulated her

అభినందనలు తెలిపిన ప్రముఖులు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) ‘ఎక్స్‌’ వేదికగా స్పందిస్తూ, భారత బాక్సర్ల అపూర్వ విజయంతో దేశం గర్విస్తోందని అన్నారు. ముఖ్యంగా, తెలంగాణ బిడ్డ అయిన నిఖత్ జరీన్ తన అద్భుతమైన పంచ్‌లతో స్వర్ణం గెలవడంపై ప్రత్యేక అభినందనలు తెలిపారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,

ఎమ్మెల్సీ కవిత కూడా నిఖత్‌ను ప్రశంసించారు. “నీ కఠోర శ్రమ, అలుపెరగని పట్టుదల భారత్‌కు, తెలంగాణకు గర్వకారణంగా నిలుస్తున్నాయి. పెద్ద కలలు కనే ఎంతో మంది యువతులకు నువ్వు స్ఫూర్తి” అని కేటీఆర్ (KTR) ‘ఎక్స్‌’లో పోస్ట్ చేశారు. నిఖత్ అంకితభావం ప్రతి విజయంలో కనిపిస్తోందని కవిత కొనియాడారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870