తెలంగాణకు జీవిత నదులైన గోదావరి, కృష్ణా జలాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) స్పష్టంచేశారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు(Banakacherla Project)పై ఏర్పడిన రాజకీయ దుమారంపై అన్ని పార్టీల ఎంపీలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టును అడ్డుకోవడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పోరాటానికి సిద్ధమైందని చెప్పారు. కేంద్రం ముందు బలమైన వాదనలు వినిపించి, ప్రాజెక్టుకు అనుమతి రాకుండా చూస్తామని అన్నారు.
కేసీఆర్‌తోనే ప్రాజెక్ట్‌కు అంకురార్పణ
ఈ ప్రాజెక్టుకు మదుపు ప్రారంభం 2016లోనే జరిగిందని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్‌లో గోదావరి మిగులు నీటి వినియోగాన్ని ప్రతిపాదించారని రేవంత్ గుర్తు చేశారు. కేసీఆర్ సూచనల ప్రకారమే అనంతరం జగన్‌తో సమావేశాలు జరిగాయని, ఇదే ప్రాజెక్టు ఇప్పుడు బనకచర్ల రూపంలో ముందుకు సాగుతోందన్నారు. రాయలసీమ సస్యశ్యామలంగా మారుతుందని మీడియా ముందు కూడా కేసీఆర్ మాట్లాడిన విషయాన్ని రికార్డు ఆధారంగా గుర్తు చేశారు.
విపక్షాల విమర్శలు – వాకౌట్ చేసిన బీఆర్‌ఎస్
సమావేశంలో సీఎం వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ విమర్శల సమయం కాదని, ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు వ్యూహం రూపొందించాల్సిన సమయమని పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరంగా తాము సమావేశం నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రాజెక్ట్ పరిణామాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్ట్ తెలంగాణకు కలిగించే నష్టాలు, కేంద్రంపై ఒత్తిడిని ఎలా ముమ్మరం చేయాలో అంశాలపై చర్చలు జరిపారు.
Read Also : Jagan Tour : పరామర్శ పేరుతో.. మరో రెండు ప్రాణాలను బలి తీసుకున్నాడు