హైదరాబాద్(Hyderabad) నగరం(Global Summit) మరొక భారీ వినోద ప్రాజెక్టుతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దుబాయ్, సింగపూర్ తరహాలో ‘టన్నెల్ అక్వేరియం’ను నగరంలో ఏర్పాటు చేయాలనే ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. నీటి అడుగున నడుస్తూ విభిన్న సముద్ర జీవులను ప్రత్యక్షంగా, అతి సమీపంగా చూసే అరుదైన అవకాశాన్ని ఈ ప్రాజెక్టు అందించనుంది. సుమారు రూ.300 కోట్ల పెట్టుబడితో కెడాల్ సంస్థ ఈ అద్భుత సదుపాయాన్ని నిర్మించనుంది. ఇది సిద్ధమైతే హైదరాబాద్ పర్యాటక రంగానికి కొత్త రూపురేఖలు ఏర్పడతాయి. ఇక నగరంలోనే బీచ్ అనుభూతి కలిగించే కృత్రిమ బీచ్ ప్రాజెక్టు కూడా త్వరలో రూపుదిద్దుకోనుంది. కొత్వాల్గూడలో 35 ఎకరాల విస్తీర్ణంలో సుమారు ₹235 కోట్లతో రూపొందుతున్న ఈ బీచ్‌కు స్పెయిన్ కంపెనీలు సాంకేతిక సహకారం అందిస్తున్నాయి. ప్రజలు తక్కువ ఖర్చుతోనే బీచ్‌లో స్నానం, బోటింగ్ వంటి వినోదాలను ఆస్వాదించవచ్చు. అదనంగా డెస్టినేషన్ వెడ్డింగ్స్, ప్రత్యేక ఈవెంట్ల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.
Read also: సోనియాగాంధీకి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

అంతర్జాతీయ సాంస్కృతిక కేంద్రం–వినోద రంగానికి భారీ ఊతం
పర్యాటక రంగానికి మరింత బలం చేకూర్చేందుకు భారత్ ఫ్యూచర్ సిటీలో వెయ్యి కోట్ల విలువైన అంతర్జాతీయ సాంస్కృతిక కేంద్రం ఏర్పాటుకానుంది. ప్రపంచ దేశాల కళలు, సంస్కృతులు, ప్రదర్శనలు ఒకే వేదికపై అందుబాటులో ఉండేలా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. అదే ప్రాంతంలో ప్రేక్షకులకు ఆకాశంలో ఎగురుతున్న అనుభూతి కలిగించే అత్యాధునిక ఫ్లయింగ్ థియేటర్ కూడా ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా, వికారాబాద్‌లో 24 గంటలు సేవలు అందించే క్యారవాన్ పార్క్ ఏర్పాటుకు చర్యలు వేగంగా సాగుతున్నాయి. పార్కింగ్, ఈవీ ఛార్జింగ్, ఆహారం, వ్యూయింగ్ టవర్ వంటి సదుపాయాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. పర్యాటక రంగంలో ఉపాధి పెంచేందుకు STEPS (School of Tourism Entrepreneurship and Projects) పేరుతో ప్రత్యేక శిక్షణా కేంద్రం కూడా ఏర్పాటు చేయనున్నారు. చారిత్రక కోటల వద్ద రెంటల్ కాస్ట్యూమ్స్ వంటి క్రియేటివ్ పర్యాటక సేవలను కూడా ప్రోత్సహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే, హైదరాబాద్ దేశంలోనే ప్రధాన టూరిజం హబ్‌గా మరింత ఎదగనుందనే నమ్మకం ప్రభుత్వానికి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: