తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 (Global Summit 2025) రెండోరోజు కొనసాగుతోంది.. ఈ నేపథ్యంలోనే ఈరోజు, మంత్రి కొండా సురేఖ, ఇందిరమ్మ చీరను కట్టుకొని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు హాజరయ్యారు. ఆమెను చూసిన మంత్రులు, అధికారులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరోవైపు ఇందిరమ్మ చీర కట్టిన సురేఖ ఫొటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.
Read Also: Upasana: తెలంగాణలో అపోలో గ్రూప్ భారీ పెట్టుబడి: ఉపాసన
నాణ్యతతో కూడిన చీరలను అందించింది
ఈ సందర్భంగా ఆమె (Minister Konda Surekha) మాట్లాడుతూ, గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరుతో నాణ్యత లేని చీరలను పంపిణీ చేసిందని ఆరోపించారు. వాటిని మహిళలు ధరించడానికి వీలులేని విధంగా ఉన్నాయని అన్నారు. తమ ప్రభుత్వం నాణ్యతతో కూడిన చీరలను అందించిందని,

అందుకే మంత్రులు, మంత్రుల భార్యలు ఇందిరమ్మ చీరలు ధరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారని తెలిపారు. సోనియా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని తాను గ్లోబల్ సమ్మిట్ (Global Summit 2025) కు ఈ చీరను ధరించి వచ్చానని అన్నారు. తమది ఇందిరమ్మ పాలన అని కొండా సురేఖ స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: