हिन्दी | Epaper

Gas Cylinder Shortage: గ్యాస్ కొరతపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ

Aanusha
Gas Cylinder Shortage: గ్యాస్ కొరతపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ

Gas Cylinder Shortage: తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా వినిపిస్తున్న గ్యాస్ కొరత వార్తలపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వివరణ ఇచ్చారు. సూర్యాపేటలో నిర్వహించిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రాష్ట్రంలో గృహ అవసరాలకు వాడే (Domestic) గ్యాస్ సిలిండర్ల కొరత లేదని స్పష్టం చేశారు. కేవలం వాణిజ్య (Commercial) అవసరాలకు వాడే సిలిండర్ల సరఫరాలో మాత్రమే కొంత అంతరాయం ఏర్పడిందని ఆయన తెలిపారు.

Read Also: Kavitha CBI Notice : కవిత ఇంటికి సీబీఐ అధికారులు, ఢిల్లీ లిక్కర్ కేసులో హైకోర్టు నోటీసులు

Gas Cylinder Shortage: Minister Uttam's clarity on gas shortage
Gas Cylinder Shortage: Minister Uttam’s clarity on gas shortage

వారిపై చర్యలు

సూర్యాపేటలో ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గ్యాస్ కొరతపై శుక్రవారం చమురు రంగ కంపెనీలతో సమీక్షిస్తామని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామని అన్నారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందిలేకుండా గ్యాస్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ల విషయంలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీలర్లు బ్లాక్ మార్కెటింగ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.

ప్రజలు గ్యాస్ కొరతతో ఇబ్బందిపడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మరో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఇద్దరు కేంద్రమంత్రులు, ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా మన రాష్ట్రానికి కావాల్సిన గ్యాస్‌ను తీసుకురావడం లేదని విమర్శించారు. మున్ముందు ఎరువుల కొరత కూడా ఏర్పడే అవకాశముందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ చర్యలు తీసుకుంటోందని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870