ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ (Congress)లో నెలకొన్న అంతర్గత విభేదాలు తీవ్రతరమవుతున్నాయి. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి (Konda Murali) ఇటీవల పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేయడం ఈ సమస్యను మరింత హైలైట్ చేసింది. జిల్లాలో వర్గపోరు తారా స్థాయికి చేరగా, మురళి పీసీసీ క్రమశిక్షణ కమిటీకి మొత్తం ఆరు పేజీల నివేదికను అందజేశారు. గాంధీభవన్‌లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని మురళి స్వయంగా కలవడం, పార్టీ వ్యవస్థలో సమస్యలు ఎంత దూరం వెళ్లాయో స్పష్టమవుతోంది.
తన నిబద్ధత, రాజకీయ పయనంపై స్పష్టత
మీడియాతో మాట్లాడుతూ కొండా మురళి మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్ జిల్లాకే రెండు ఎమ్మెల్సీ స్థానాలు రిజర్వ్ చేయించడంలో తన పాత్ర కీలకమని గుర్తు చేశారు. భారతదేశంలో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా గెలిచిన ఘనత తనదేనని పేర్కొన్నారు. తాను రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నానని స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ బీసీల కోసం, సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని తెలిపారు. తనపై ఎవరూ ప్రశ్న వేయలేరని, తనను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఫలించవని, ఇంకా తన శరీరంలో నాలుగు బుల్లెట్లు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీకి నిబద్ధత.. పదవికి కాదు
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారేటప్పుడు తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వచ్చానని కొండా మురళి పేర్కొన్నారు. అదే తన నిబద్ధతకు నిదర్శనమని, ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న కొందరి నాయకుల్లా తాను పదవిలో కొనసాగలేదని విమర్శించారు. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూసే ఆత్మీయత తనకు ఉందని తెలిపారు. తనపై ఎలాంటి విచారణ జరిపించలేదు కానీ తానే స్వయంగా వచ్చి వాస్తవాలు వివరించానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ రాజకీయాలను మరింత ఉద్రిక్తతలోకి నెట్టే అవకాశం ఉంది.
Read Also : Trisha Krishnan: ఆలయానికి నటి త్రిష విరాళంగా రోబో ఏనుగును