हिन्दी | Epaper

Forest Attack : అటవీ అధికారులపై దాడి ఘటన – 35 మంది పై కేసు నమోదు

Shravan
Forest Attack : అటవీ అధికారులపై దాడి ఘటన – 35 మంది పై కేసు నమోదు

Forest Attack : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (Joint Adilabad District) కవ్వాల్ అటవీ ప్రాంతంలో పులుల సంరక్షణ కేంద్రం పరిధిలో గల జన్నారం అటవీ డివిజన్లో అటవీ శాఖ అధికారులపై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో 35 మంది గిరిజనులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. శుక్రవా రం సాయంత్రం పోడు భూమి విషయమై ఇరువర్గాల మధ్య జరిగిన వివాదం కారణంగా గిరిజనులు అటవీ శాఖ అధికారులపై దాడులకు పాల్పడ డం తెలిసిందే. కవ్వాల్ సెక్షన్లోని పాలగోరి అటవీ ప్రాంతంలో సిర్పూర్ (యు)కు చెందిన కొందరు గిరిజనులు గుడిశెలు వేసుకోవడం, వాటిని అట వీ శాఖ అధికారులు తొలగించడంతో నెలకొన్న వివాదం ఈ దాడికి దారి తీసింది. ఒక పథకం ప్రకారం కొందరు గిరిజనులు అటవీ శాఖ అధికారుల కళ్లలో కారం చల్లి దాడికి పాల్పడ్డారని ఇంధన్పల్లి రేంజి అధికారి శ్రీధరా చారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Forest Attack

ఈ దాడిలో ఇద్దరు అటవీ అధికారులు గాయపడ్డారని ఆయన తెలిపారు. కాగా ఈ ఫిర్యాదు మేరకు 35 మందిపై కేసులు నమోదు (Cases registered) చేయగా ఈ ఘటనలో గిరిజనలను మోతీరాం అనే వ్యక్తి దాడికి ఉసిగొల్పినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో నిందితులపై అటవీ, వన్యప్రాణి చట్టాల ప్రకారం కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో నిందితులను గుర్తించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/rains-alert-government-on-alert-as-rain-forecast-for-another-four-days-in-telangana/andhra-pradesh/528821/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య

పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య

తగ్గిన యూరియా ఉత్పత్తి.. రైతులకు తప్పని తిప్పలు!

తగ్గిన యూరియా ఉత్పత్తి.. రైతులకు తప్పని తిప్పలు!

మార్చి 12న సీఎం చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్!

మార్చి 12న సీఎం చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్!

బైక్ కొనివ్వలేదని బాలుడు బలవన్మరణం

బైక్ కొనివ్వలేదని బాలుడు బలవన్మరణం

విద్యుత్ వినియోగదారులకు శుభవార్త.. కరెంట్ చార్జీల పెంపు లేనట్టే!

విద్యుత్ వినియోగదారులకు శుభవార్త.. కరెంట్ చార్జీల పెంపు లేనట్టే!

కామారెడ్డి కేసు మిస్టరీ వీడింది, ముగ్గురు కూతుళ్లను చంపిన తండ్రి

కామారెడ్డి కేసు మిస్టరీ వీడింది, ముగ్గురు కూతుళ్లను చంపిన తండ్రి

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

బీఆర్ఎస్‍తో బీజేపీ పొత్తు పై రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్‍తో బీజేపీ పొత్తు పై రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు

డ్వాక్రా మహిళల హెల్త్ ప్రొఫైలింగ్ కార్యక్రమం షురూ

డ్వాక్రా మహిళల హెల్త్ ప్రొఫైలింగ్ కార్యక్రమం షురూ

ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడేలా చేస్తాం

ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడేలా చేస్తాం

జ‌గిత్యాల జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

జ‌గిత్యాల జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

శాసన మండలి నూతన భవనాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి

శాసన మండలి నూతన భవనాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి

📢 For Advertisement Booking: 98481 12870