గత మూడురోజులుగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. హుస్సేనాసాగర్, మూసీ (Musi River)లలో అకస్మాత్తుగా వరద నీరు పెరిగింది.
దీంతో మూసీలో వరద పెరగడంతో పూజారి కుటుంబం వరదలో చిక్కుకునిపోయింది. అలాగే శివాలయంలో నలుగురు వ్యక్తులు చిక్కుకునిపోయారు. ఘట్కేసర్ మండలంలోని మూసీ వంతెలనపై వరదనీరు ప్రవహిస్తోంది. ప్రతాపసింగారం, కొర్రెముల వద్ద మూసీ వంతెనపై నుంచి వరద ప్రవాహం ఉదృతంగా ప్రవహిస్తోంది. వంతెనలపై వరద నీరు ప్రవహిస్తుండడంతో రోడ్లపై వాహనాల రాక పోకలను తీవ్ర ఆటంకం ఏర్పడింది.
TGSRTC: MGBS నుంచి బస్సుల రాకపోకలు బంద్..కారణం ఏంటంటే?
చాదర్ ఘాట్లో నీట మునిగిన ఇళ్లు
భారీ వర్షాలకు మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చాదర్ ఘాట్ (Chadar Ghat) సమీపంలోని ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. అకస్మాత్తుగా ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. మూసారాంబాగ్ వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తున్నాయి. దీంతో ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులకుగురవుతున్నారు.
దీంతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మూసీ వెంట లోతట్టు ప్రాంతాల విషయంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాక లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. ముంపు కాలనీల వాసులకు పునరావాసం కల్పించాలని కూడా రేవంత్ రెడ్డి ఆదేశించారు.
కుండపోత వర్షాలు
రాజేంద్రనగర్, అత్తాపూర్, హిమాయత్ సాగర్, కిస్మత్ పూర్, గండిపేట్, శంషాబాద్, కార్వాన్, జియాగూడ, లంగర్ హౌస్ ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డిలు ఇక్కడి
పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
చాదరూట్ వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న మూసీ నది
చాదర్ ఘాట్ వద్ద చిన్న వంతెనపై ప్రమాదకరంగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో ఈ వంతెనపై రాకపోకలను అధికారులు నిలిపి వేసారు. ఇక్కడి పలు కాలనీలలో వరదనీరు చేరింది. దీంతో అధికారులు ప్రజలను ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు.మరో రెండురోజులు వర్షాలు తప్పవు కావున, అవసరం అయితే బయటకు రావాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: