తెలంగాణ (TG) ఆర్థిక శాఖ తాజాగా తీసుకున్న కీలక నిర్ణయం ఉద్యోగుల కోసం సంచలనమైంది. ఆధార్ వివరాలు సమర్పించని ఉద్యోగుల జీతాలను ఈ నెల నిలిపివేయాలని ఆర్థిక శాఖ (Finance Department) అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 25 వరకు ఉద్యోగులు రెండు సార్లు వివరాలను సమర్పించడానికి అవకాశం కల్పించినప్పటికీ, పెద్ద సంఖ్యలో వారు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Read Also: Liqour: మద్యం టెండర్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ – లాటరీకి గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో మొత్తం 5.21 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు, 4.93 లక్షల మంది టెంపరరీ ఉద్యోగులు పని చేస్తున్నారు. శనివారం రాత్రి వరకు టెంపరరీ ఉద్యోగుల్లో 3.75 లక్షల మంది ఉద్యోగులు IFMIS పోర్టల్‌లో తమ ఆధార్ వివరాలను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఉద్యోగుల వివరాలను సమర్పించడానికి రెండు సార్లు గడువు
ఈ నెల 25 వరకు ఉద్యోగుల వివరాలను సమర్పించడానికి రెండు సార్లు గడువు పొడిగింపు ఇచ్చినప్పటికీ, పూర్తి స్పందన లేకపోవడం ఆర్థిక శాఖకు ఈ నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్, టెంపరరీ ఉద్యోగులందరికి ఆధార్ సమర్పణ తప్పనిసరి అని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే IFMIS (Integrated Financial Management and Information System) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలను సమర్పించడం కొనసాగుతోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: