హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ మరియు ఇతర వృత్తి విద్యా కళాశాలల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులు ఫీజు(Fee) రీయింబర్స్‌మెంట్(Reimbursement) బకాయిల వివాదం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. గత మూడేళ్లకి సంబంధించిన రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో, కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయి. 2022-23, 2023-24, 2024-25 విద్యా సంవత్సరాలకు సంబంధించి ప్రతి ఏటా రూ.2,500 కోట్ల చొప్పున మొత్తం రూ.7,500 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది బకాయిలు కూడా కలిపితే మొత్తం రూ.10 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా.
Read Also: TTD: రెండురోజుల వైకుంఠద్వార దర్శనాలకే మొగ్గు!
ప్రభుత్వ హామీ, నిధుల విడుదల జాప్యం
రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ కళాశాలలు కలిసి’ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్’ (ఫతి) గా ఏర్పడ్డాయి. గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకపోతే సెమిస్టర్ పరీక్షలను బంద్ చేస్తామని ఫతి ప్రకటించింది. దీంతో ప్రభుత్వం చర్చలు జరిపి బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో కళాశాలలు తెరుచుకున్నాయి. సెప్టెంబర్ 14న మరోసారి చర్చలు జరిపినప్పుడు, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) పెండింగ్‌లో ఉన్న వాటిలో రూ.1,200 కోట్లకు సంబంధించిన నిధులను రెండు విడతల్లో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఆ తర్వాత సెప్టెంబర్ 30 వరకు కూడా నిధులు విడుదల కాకపోవడంతో అక్టోబర్ 1న ₹300 కోట్లు విడుదల చేశారు. దసరా పండుగ తర్వాత సుమారు ₹374 కోట్లు విడుదల చేశారు. టోకెన్లు జారీ చేసిన వాటిలోనే ఇంకా రూ.876 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.

నవంబర్ 3 నుంచి కాలేజీల బంద్‌కు హెచ్చరిక
టోకెన్లు జారీ చేసిన వాటిలోనే ఇంకా రూ.876 కోట్లు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో, బుధవారం ‘ఫతి’ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ఉప ముఖ్యమంత్రిని కలిశారు. పెండింగ్ రీయింబర్స్‌మెంట్ బకాయిలను నవంబర్ 1లోగా విడుదల చేయకపోతే నవంబర్ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలను నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తం పెండింగ్ బకాయిలు ఎంతగా ఉన్నాయి?
గత మూడేళ్ల బకాయిలు, ఈ ఏడాది బకాయిలు కలిపి మొత్తం రూ.10 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
కళాశాలలు ఎప్పటి నుంచి బంద్‌కు హెచ్చరికలు జారీ చేశాయి?
నవంబర్ 3వ తేదీ నుంచి నిరవధికంగా కళాశాలలను బంద్ చేస్తామని హెచ్చరించాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: