హైదరాబాద్ :ఆరుకాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను అరబెట్టుకోవటానికి వర్షాల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు(Farmers) నానా ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితి ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో అకాల వర్షాల నుంచి పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు టార్పిలిన్లు రైతులకు ఇప్పుడు అత్యవసరం. వరి, కంది, ఇతర అంతర పంటలు సాగు చేసిన రైతులకు ధాన్యం ఆరబెట్టేందుకు తమ పొలాల్లో టార్ఫిలిను ముఖ్యంగా కావాల్సి ఉంది.

Read Also: 10th పబ్లిక్ పరీక్షల తేదీలు విడుదల?
గతంలో ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై టార్పాలిన్లను రైతులకు(Farmers) సరఫరా చేసేది. వర్షాలు, ప్రకృతి విపత్తుల నుంచి పంటలను రక్షిచుకోవటానికి వ్యవసాయ శాఖ గతంలో సబ్సిడీపై రైతులకు టార్పిలిన్లు అందించేది. మార్కెట్లో 2,500 రూపాయలకు లభించే టర్పిలిన్లను 50 శాతం సబ్సిడీతో 1,250 రూపాయలకే రైతులకు సరఫరా చేసేది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయ శాఖ టార్పాలిన్ల సరఫరాను నిలిపివేసింది. దీంతో మార్కెట్లో టార్పలిన్ల ధరలు అధికంగా ఉండటంతో వాటిని కొనలేక రైతులు అద్దెకు తెచ్చుకుంటున్నారు.
ఒక్కో టార్పాలిన్కు రోజుకు 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు అద్దెకు తెచ్చుకుంటున్నారు. ధాన్యం ఆరబెట్టుకోవటానికి సాధారణంగా ప్రతీ రైతు కనీసం ఆరు నుంచి 10 టార్పాలిన్లు అవసరం ఉంటుంది. వాటిపై ప్రతీ రోజు అద్దెకు తెచ్చుకోవటంతో భారం పడుతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి కోత దశకు రావటంతో రైతులంతా కోత మిషన్లతో వరి పంటను కోయిస్తున్నారు. ఇప్పుడు అకాల వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: