కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో చోటుచేసుకున్న ఒక ఫేక్ కాల్(Fake Call) ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. అమెరికాలో చదువుకుంటున్న కుమారుడి పేరుతో సైబర్ నేరగాళ్లు(Cyber criminals) చేసిన మోసపు కాల్ తండ్రి ప్రాణాన్ని తీసేంత భయాన్ని కలిగించింది.
Read Also: Janasena Party: జనసేన ఎక్స్ అకౌంట్ హ్యాక్

కుమారుడి పేరుతో నేరగాళ్ల మోసం
హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి గ్రామానికి చెందిన మాసాడి లక్ష్మణరావు కుమారుడు గత మూడేళ్లుగా అమెరికాలో విద్యనభ్యసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు లక్ష్మణరావుకు ఫోన్(Fake Call) చేసి “మీ కుమారుడు నేరం చేశాడు, ప్రస్తుతం మా కస్టడీలో ఉన్నాడు. కేసును మాఫీ చేయాలంటే వెంటనే రూ.9 లక్షలు జమ చేయాలి” అంటూ బెదిరించారు. తర్వాత మళ్లీ కాల్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ క్లోనింగ్ సాయంతో కుమారుడి గొంతుతో మాట్లాడించారు. “నాన్నా, నన్ను కాపాడు… వీళ్లు నన్ను చంపేస్తారు” అంటూ కేకలు వినిపించడంతో లక్ష్మణరావు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.
భయంతో కిందపడిన తండ్రి
భయంతో వెంటనే హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి విషయం వివరించడానికి ప్రయత్నించిన లక్ష్మణరావు, అకస్మాత్తుగా బీపీ పెరగడంతో కిందపడిపోయాడు. పోలీసులు వెంటనే అతన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
పోలీసుల హెచ్చరిక
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్ఐ యునస్ మాట్లాడుతూ, “పోలీస్, సీబీఐ, బ్యాంక్ అధికారి పేరుతో వచ్చే కాల్స్‌కి ఎవరూ నమ్మకండి. ఇలాంటి కాల్స్‌కి గురైతే వెంటనే పోలీసులను సమాచారం ఇవ్వండి” అని ప్రజలను అప్రమత్తం చేశారు. ఇటీవల ఇటువంటి ఫేక్ కాల్స్ మరియు AI వాయిస్ క్లోనింగ్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: