हिन्दी | Epaper

Investment in Telangana : కాంగ్రెస్ చెబుతున్నవన్నీ కట్టుకథలే – కవిత

Sudheer
Investment in Telangana : కాంగ్రెస్ చెబుతున్నవన్నీ కట్టుకథలే – కవిత

తెలంగాణలో పెట్టుబడుల సమీకరణకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకుంటున్న ఒప్పందాలపై (MoUs) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి చీఫ్ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం విదేశీ పర్యటనల్లో కుదుర్చుకుంటున్న ఒప్పందాలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయని కవిత విమర్శించారు. ముఖ్యంగా ‘సింగపూర్ గేట్వే’ అనే సంస్థకు కనీసం వెబ్‌సైట్ కూడా లేకపోవడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కనీస ఉనికి లేని కంపెనీలతో వేల కోట్ల రూపాయల ఒప్పందాలు ఎలా చేసుకుంటారని ఆమె ప్రశ్నించారు. పెట్టుబడుల పేరుతో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి వేరుగా ఉందని ఆమె ఆరోపించారు.

YSRCP: చంద్రబాబు ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు

దాదాపు 70 వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెడతామన్న ‘ఇన్ఫ్రా కీ డేటా సెంటర్ పార్క్’ కంపెనీ విశ్వసనీయతను కవిత తప్పుబట్టారు. ఈ సంస్థ గతేడాదే ఏర్పడిందని, ఇది కేవలం వివిధ దేశాలతో ఒప్పందాలు (MoUs) చేసుకోవడానికే పుట్టినట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఈ సంస్థ అమెరికాలో 90 వేల కోట్లు, బ్రెజిల్‌లో 70 వేల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుందని.. అసలు ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టే సామర్థ్యం ఆ సంస్థకు ఉందా? అని ఆమె నిలదీశారు. పెట్టుబడి విలువ కంటే తక్కువ మూలధనం ఉన్న కంపెనీలు వేల కోట్ల ఒప్పందాలు చేయడం వెనుక ఉన్న మర్మాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

ప్రభుత్వ ఒప్పందాల్లో పారదర్శకత లోపించిందని, ముఖ్యంగా జయవీర్ రెడ్డికి సంబంధించిన కంపెనీల వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని కవిత కోరారు. 10 లక్షల రూపాయల మూలధనం కూడా లేని కంపెనీలు రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు ఎలా తెస్తాయని ఆమె ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులను తమ ఖాతాలో వేసుకోవడమే కాకుండా, కొత్తగా వచ్చేవి కూడా కట్టుకథలేనని ఆమె విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే ఈ కంపెనీల పూర్తి వివరాలను, వాటి ఆర్థిక స్థితిగతులను బహిర్గతం చేయాలని ఆమె పట్టుబట్టారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: ప్రతిమా సింగ్

ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: ప్రతిమా సింగ్

పోలీస్ శాఖ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

పోలీస్ శాఖ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

అంగన్‌వాడీల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం: శృతి ఓజా

అంగన్‌వాడీల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం: శృతి ఓజా

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో సారా దుకాణాలు తెరవాలి – ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

తెలంగాణలో సారా దుకాణాలు తెరవాలి – ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

గచ్చిబౌలి స్టేడియం పునర్నిర్మాణం- సీఎం రేవంత్ ఆదేశం

గచ్చిబౌలి స్టేడియం పునర్నిర్మాణం- సీఎం రేవంత్ ఆదేశం

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

కేసీఆర్, కేటీఆర్‌‌పై నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

కేసీఆర్, కేటీఆర్‌‌పై నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

తెలంగాణలో వడదెబ్బ మరణాలకు ₹4 లక్షల పరిహారం!

తెలంగాణలో వడదెబ్బ మరణాలకు ₹4 లక్షల పరిహారం!

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

📢 For Advertisement Booking: 98481 12870