తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)పై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రూ. లక్ష కోట్లకు పైగా వ్యయం చేసిన ఈ ప్రాజెక్టు, ఉద్దేశించిన లక్ష్యాలను చేరలేకపోయిందని ఆయన విమర్శించారు. “ప్రాజెక్టులు ఎలా కట్టకూడదు అనడానికి కాళేశ్వరం ఒక మంచి ఉదాహరణ” అని తెలిపారు. నిర్మాణానికి మూడేళ్లలోనే కూలిపోయిన ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా లేదని ఎద్దేవా చేశారు.
వెయ్యి ఎకరాలకైనా నీరు అందలేదు
ఈ ప్రాజెక్టుతో అదనంగా వెయ్యి ఎకరాలకైనా నీరు అందలేదని సీఎం స్పష్టం చేశారు. అనేక సాంకేతిక లోపాలతో పాటు, ప్రాథమిక అధ్యయనాలు లేకుండానే దీన్ని నిర్మించారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా మట్టి పరీక్షలు చేయకుండానే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌దేనని ఆయన విమర్శించారు. ప్రజాధనం వృథా చేసిన బాధ్యతను మాజీ ప్రభుత్వమే తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
రాబోయే రోజుల్లో ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ఉండేలా చర్యలు
హైదరాబాద్‌లో నీటిపారుదల విభాగంలోని అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేసిన సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు ప్రణాళికాబద్ధంగా, సమర్థవంతంగా నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. వచ్చే రోజుల్లో ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని, గతంలో జరిగిన తప్పిదాలను పునరావృతం చేయబోమని సీఎం హామీ ఇచ్చారు.
Read Also : Modi : విశాఖ యోగా వేడుకలకు ప్రధాని మోదీ