హైదరాబాద్ EPSET : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఇంజనీరింగ్ తోపాటు అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో (Course) ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్ సెట్-2025 కౌన్సెలింగ్లో భాగంగా ఇంటర్నల్ స్లైడింగ్ వెబ్ ఆప్షన్లు ముగియగా శుక్రవారం సీట్ల కేటాయింపు చేపట్టారు. ఇంటర్నల్ స్లైడింగ్లో భాగంగా 9419 మంది తమ బ్రాంచ్లను మార్చుకోవడం కోసం 9419 మంది వెబ్ ఆప్షన్లను ఇచ్చారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారిలో 3590 మందికి సీట్లను కేటాయిం చారు. ఇంటర్నల్ స్లైడింగ్లో సీట్లు పొందిన విద్యార్థులు నేడు (శనివారం) కొత్త బ్రాంచ్లో చేరాలని సాంకేతిక విద్యశాఖ కమిషనర్ శ్రీదేవసేన శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఎప్ సెట్ కౌన్సెలింగ్లో భాగంగా 97,369 మంది సర్టిఫికెట్ వెరిఫై కేషన్ ను నిర్వహించారు. రాష్ట్రంలో 180 కాలే జీల్లో 90,246 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి.

రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో 13,453 సీట్లు ఖాళీ
వాటిలో ఇంటర్నల్ స్లైడింగ్ పూర్తయ్యే నాటికి 76,793 సీట్లు భర్తీ అయ్యాయి. మరో 13,453 సీట్లు ఖాళీగా ఉన్నట్టు సాంకేతిక విద్యశాఖ కమిషనర్ తెలిపారు. మొత్తం కన్వీనర్ సీట్లలో 85.1 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. కోస్గిలోని గవర్నమెంట్ కాలేజీలో 198 సీట్లకి 49 సీట్లు భర్తీ కాగా మరో 149 సీట్లు ఖాళీగా ఉన్నాయి. యూనివర్సిటీ కాలేజీలు 21 ఉండగా వాటిలో 6440 సీట్లకిగాను 4482 సీట్లు భర్తీకాగా.. మరో 1958 సీట్లు ఖాళీగా ఉన్నాయి. రెండు ప్రైవేటు యూనివర్సిటీల్లో 1386 సీట్లు ఉంటే.. వాటిలో 1340 సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 156 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో (Private engineering colleges) 82,222 సీట్లు ఉండగా.. వాటిలో 70,922 సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తంగా కన్వీనర్ కోటాలో 90,246 సీట్లు అందుబాటులో ఉంటే 76,793 సీట్లు భర్తీకాగా.. మరో 13,453 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :