హైదరాబాద్ (పటాన్ చేరు) :
గ్రామీణ ప్రజలు, భారత రైతాంగ సాధికారతతోనే జాతీయ సమైక్యత బలోపేతం అవుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యు మానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్లోని రాజకీయ శాస్త్ర (పొలిటికల్ సైన్స్) విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండురోజుల సర్దార్ వల్లభభాయ్ పటేల్, రైతులు చంపారన్ నుంచి చిత్రకూట్ వరకు జాతీయ చర్చాగోష్ఠిని సోమవారం ఆయన జ్యోతి ప్రజ్వలనలతో లాంఛనంగా ప్రారంభిం చారు. భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధనా మండలి (ఐసీఎస్ఎస్ఆర్) సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. స్వాతంత్రం తరువాత 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో సర్దార్ పటేల్ అద్భుతమైన పాత్రను వివరించారు. రైతు పటేల్ ఉద్యమాలకు పటేల్ నాయకత్వాన్ని, చేసిన సేవలు అంతగా వెలుగులోకి రాలేదన్నారు.
చారిత్రాత్మక బార్డోలి సత్యాగ్రహం (1928)లో రైతులు, భూమిలేని కార్మికుల సాధికారత కోసం సర్దార్ పటేల్ చేసిన కృషిని గవర్నర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గ్రామీణ భారతదేశం జాతికి ఆత్మగా మిగిలి పోతుందని చెప్పారు. అంతకు ముందు ఆయన మహాత్మాగాంధీకి విగ్రహానికి నివాళులు అర్పించి, ఆ తరువాత పోలీసుల నుంచి గౌరవవందనం (Guard of Honor) స్వీకరించారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ విశిష్టతను గౌరవ అతిథి, గుజరాత్ ప్రభుత్వ ఇండెక్స్ సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఐఎఎస్ అధికారి డాక్టర్ సంజయ్ జోషి వివరించారు. ఐక్యతా స్ఫూర్తిని పొందడం కోసం గుజరాత్లో నెలకొల్పిన సర్దార్ పటేల్ స్మారక నివాళిని సందర్శించమని విద్యార్థులను జోషి ప్రోత్సహించారు. సామాజిక సమరస్థ మంచ్ జాతీయ కన్వీనర్ కె.శ్యామ్ ప్రసాద్ పటేల్ నాయకత్వం గురించి ప్రముఖంగా ప్రస్తావించ డంతో పాటు, ఆయనపై రాజ్మాహన్గాంధీ రచించిన పుస్తక ప్రతులను వేదిక పైనున్న ప్రముఖులకు బహూకరించారు.

గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు స్వాగతోపన్యాసంలో అతిథులను సభకు పరిచయం చేయడంతో పాటు గీతం పురోగతిని సోదాహరణంగా వివరించారు. అనేక మంది ప్రముఖ పండితులు, ఆలోచనాపరులు ఈ రెండు రోజుల జాతీయ చర్చాగోష్ఠిలో పాల్గొంటున్నారు. వీరిలో గుజరాత్లోని సర్దార్ పటేల్ విశ్వవిద్యా లయం చరిత్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వసంత్కుమార్ ఆర్.పటేల్, తెలంగాణ లోని ములుగులోని సమ్మక్క సారక్క గిరిజన కేంద్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై.ఎల్. శ్రీనివాస్: ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యా లయం ఇంచార్జ్ రిజిస్ట్రార్ అండ్ డీన్ ప్రొఫెసర్ షీలారెడ్డి, హైదరాబాద్ విశ్వవిద్యాలయం సోషియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ జి.నాగ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి, ఐసీఎస్ఎస్ఆర్ దక్షిణ ప్రాంత డైరెక్టర్ ప్రొఫెసర్ సుధాకర్రెడ్డి, యూజీసీ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ జి.గోపాల్రెడ్డి తదితరు పాల్గొన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :