Education : సెప్టెంబర్ 1న అఖిల భారతీయ రాష్ట్రీయ శైకిక్ మహాసంఘ్ (ఏబిఆర్ఎస్ఎం) ఆధ్వర్యంలో నిర్వహించనున్న హమారా విద్యాలయ హమారా స్వాభిమాన్ అనే కార్యక్రమానికి అనుమతించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టిపియుఎస్) పాఠశాల విద్య డైరక్టర్ నవీన్ నికోలసికి విజప్తి చేసింది. ఏబిఆర్ఎస్ఎంకి అనుబంధంగా తెలం గాణ రాష్ట్రంలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (Tapas) ఆధ్వర్యంలో పాఠశాలల్లో ప్రార్థన సమయంలో “మన పాఠశాల – మన ఆత్మగౌరవం” అనే కార్యక్రమ ము ప్రతి పాఠశాలలో నిర్వహించే విధంగా అనుమతి ఇవ్వాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు హన్మంత రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ సోమవారం పాఠశాల విద్య డైరక్టర్కి విజప్తి చేశారు. పాఠశాలను పరిశుభ్రంగా, క్రమశిక్షణతో, ఆకుపచ్చగా, స్ఫూర్తిదాయకంగా ఉంచుతామని.. పాఠశాల ఆస్తి, వనరులను జాతీయ సంపదగా పరిగణిస్తామని, వాటిని కాపాడుతామని, వాటిని వివేకవంతంగా ఉపయో గిస్తామని పేర్కొంటూ ప్రతిజ్ఞ (Pledge) చేయించనున్నట్టు తెలిపారు. విద్యను జ్ఞాన మాధ్యమంగా మాత్రమే కాకుండా, వ్యక్తిత్వ నిర్మాణం, స్వీయ అభివృద్ధి, సామాజిక సేవకు సాధనంగా పరిగణించడం ద్వారా పని చేస్తామని, పాఠశాలలో వివక్షత లేని వాతావరణాన్ని సృష్టిస్తామని.. అందరం సమాన స్ఫూర్తితో నేర్చుకోవడం, బోధించడం అనే మార్గంలో ముందుకు సాగుతామని ప్రతిజు చేయించనున్నట్టు చెప్పారు. పాఠశాలను కేవలం ఒక సంస్థగా కాకుండా, సంస్కృతి, సేవ, అంది తభావంతో కూడిన ఒక కేంద్రంగా పరిగణి స్తామని దాని కీర్తిని పెంచడానికి నిరంతరం కృషి చేస్తామనే ప్రతిజును రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో నిర్వహిస్తున్నామని అందుకు అనుమతించాలని పాఠశాల విద్య డైరక్టర్ని సంఘం రాష్ట్ర అధ్యక్షలు హనుమంతరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ కోరినట్టు తెలిపారు.

READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :