7 నుంచి 9 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్
హైదరాబాద్: ఇంటర్మీడియట్లో బైపీసీ చదివిన విద్యార్థులు ఎప్సెట్-2025 ద్వారా బి ఫార్మసీ, పార్మా-డి, బైయో టెక్నాలజీ, బయో మెడికల్ ఇంజనీరింగ్, ఫార్మాసూటికల్ ఇంజనీరింగ్ కోర్సు(Pharmaceutical Engineering Course)ల్లో చేరడానికి కౌన్సెలింగ్ను అక్టోబర్ 5 నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబం ధించిన షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన గురువారం ప్రకటించారు. విద్యార్థులు ఆన్లైన్లో తమ వివరాలను తెలుపుతూ స్లాట్ బుక్ చేసుకోవడానికి అక్టోబర్ 5 నుంచి 8 వరకు అవకాశం కల్పించారు.

అక్టోబర్ 8 నుంచి 10 వరకు వెబ్ ఆప్షన్ల
అక్టోబర్ 7 నుంచి 9 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ను నిర్వహిస్తారు. అక్టోబర్ 8 నుంచి 10 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 13న మొదటి విడత సీట్ల కేటాయింపు చేశారు. సీటు పొందిన విద్యార్థులు అక్టోబర్ 13,14 తేదిల్లో ట్యూషన్ ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని కమిషనర్ ప్రకటనలో పేర్కొన్నారు. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ (Final Phase Counseling)అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్ 17న సర్టిఫికెట్వెరిఫికేషన్ ఉంటుంది. అక్టోబర్ 17, 18 తేదిల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 21లోగా ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. సీటు పొందిన విద్యార్థులు అక్టోబర్ 21, 22 తేదిల్లో ట్యూషన్ ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 22, 23 తేదిల్లోగా సీట్లు పొందిన విద్యార్థులు నేరుగా కాలేజీల్లో చేరాలని కమిషనర్ సూచించారు. అక్టోబర్ 24న కాలేజీల్లో చేరిన విద్యార్థుల సంఖ్యను ఆయా కాలేజీలు అప్డేట్ చేయాలని సూచించారు. అక్టోబర్ 23న స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేయనున్నట్టు కమిషనర్ శ్రీదేవసేన ప్రకటనలో పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: