తెలంగాణ తొలి ముఖ్యమంత్రి , బి.ఆర్.ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖర రావు గారి నివాసంలో దసరా పండుగ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఎర్రవెల్లిలోని నివాసంలో గురువారం జరిగిన పూజా కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు , బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు , కుటుంబ సభ్యులు , సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ గారు , కేటీఆర్ గారు దుర్గా మాతకు పూజలు నిర్వహించారు. ఆయుధ పూజలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని దుర్గా మాతను ప్రార్ధించారు. మాజీ హోం మంత్రి మహమూద్ అలీ కేసీఆర్ గారికి దసరా శుభాకాంక్షలు తెలిపారు.










Photos By S. Sridhar