హైదరాబాద్ నగరాన్ని కుదిపేస్తున్న సరోగసి అక్రమాల కేసులో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గోపాలపురం పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఆమెను అరెస్ట్ చేసి 5 రోజులపాటు పోలీసు కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం గాంధీ ఆసుపత్రి (Gandhi Hospital) లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఒక ఆర్మీ వ్యక్తి తనపై తప్పుడు ఆరోపణలు చేసి కేసు పెట్టించాడని పేర్కొన్నారు. “తప్పు చేసినది నేనే అయితే చట్టం ముందు తల వంచుతాను, కానీ నేను నిర్దోషిని. త్వరలో అన్ని విషయాలు బయటపెడతాను” అని డాక్టర్ నమ్రత స్పష్టం చేశారు.
సరోగసి అక్రమాల ఆరోపణలు
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, డాక్టర్ నమ్రత సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా అనేక అక్రమాలు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏజెంట్ల సహకారంతో అసోం రాష్ట్రానికి చెందిన మహిళల నుంచి పసిపిల్లలను కొనుగోలు చేసి, అవి సరోగసి (surrogacy) పేరుతో దంపతులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో చట్టపరమైన మార్గాలను పూర్తిగా పక్కనబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, వీర్యం, అండాలు నిబంధనలకు విరుద్ధంగా సేకరించి ఇతర రాష్ట్రాల్లో విక్రయించారని కూడా ఆరోపణలు వెలువడ్డాయి.

రాష్ట్రవ్యాప్తంగా కలకలం
ఈ ఘటన వెలుగులోకి రావడంతో సరోగసి నియమావళిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సంతానం కోసం ఎంతో ఆశతో, ఉన్న దంపతులను మోసగించి, చట్టవిరుద్ధంగా సరోగసి వ్యాపారం నడపడం పట్ల పౌరసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు మరల జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, సరోగసి సెంటర్లపై నిరంతర తనిఖీలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సరోగసి అంటే ఏమిటి?
సరోగసి అనేది ఒక మహిళ గర్భధారణ ద్వారా మరొక దంపతుల కోసం శిశువును కనడం. శిశువు పుట్టిన తర్వాత ఆ దంపతులకే చట్టబద్ధంగా అప్పగించబడుతుంది. ఇది సాధారణంగా గర్భధారణ సాధ్యంకాని లేదా ఆరోగ్య సమస్యల కారణంగా గర్భం దాల్చలేని దంపతులు ఆశ్రయించే పద్ధతి.
సరోగసి ఎన్ని రకాలుగా ఉంటుంది?
పారంపరిక సరోగసి: సరోగేట్ తల్లే గర్భదాల్చి, తన అండంతో శిశువుకు జన్మనిస్తుంది.గెస్టేషనల్ సరోగసి: శిశువు కోసం తల్లిదండ్రుల లేదా డోనర్ అండం, వీర్యం వాడి ఎంబ్రియోని సరోగేట్ గర్భాశయంలో ఉంచుతారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: