అర్బన్ నక్సల్స్ మాయలో పడి మావోయిస్టులు మోసపోయి ప్రాణాలు కోల్పోవద్దని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) అన్నారు. అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో కుటుంబ సభ్యులతో కలిసి జల్సా చేస్తున్నారనీ, ఏ పార్టీ అధికారంలో ఉన్నా పైరవీలు చేసుకుంటూ ఆస్తులు కూడగట్టుకుని కార్లలో తిరుగుతున్నారనీ, వాళ్ల మాటలు నమ్మిన అమాయకులు తుపాకీ పట్టుకుని అడవుల్లో తిరుగుతూ తిండీ తిప్పలేక ప్రాణాలు కోల్పోతున్నారనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read also : Visakha: ఉక్కు కార్మికులపై చంద్రబాబు వ్యాఖ్యలు అభ్యంతరకరం: షర్మిల

అర్బన్ నక్సల్స్ చెప్పేదొకటి చేసేదొకటి, వారి మాటలు నమ్మి మోసపోవద్దనీ, మంచి ఆలోచనలతో సమాజంలోకి వచ్చి, ప్రజలకు సేవ చేయలని పిలుపునిచ్చారు. మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవడానికి మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉందని వచ్చే మార్చినాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. మంగళవారం వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రికి సిఎస్ఆర్ నిధులతో కొనుగోలు చేసిన కోటిన్నర విలువైన వైద్య పరికరాలను అందించారు.
మావోయిస్టు నేత హిడ్మా ఎన్ కౌంటర్ పై స్పందిస్తూ
ఈ సందర్భంగా మావోయిస్టు(Moist) నేత హిడ్మా ఎన్ కౌంటర్ పై స్పందిస్తూ…. తుపాకీ ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదు. తుపాకీ పట్టుకుని అమాయకులైన దళిత, గిరిజనులను పోలీసులను చంపారనీ, జాతీయ జెండా ఎగరేయొద్దని నక్సలైట్లు బీజేపీ నేతలను ఎంతోమందిని కాల్చి చంపారనీ అన్నారు. మావోయిజాన్ని అంతం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఇప్పటికైనా మావోయిస్టులు లొంగిపోయి ప్రజా స్రవంతిలో కలవాలని కోరారు. వచ్చే మార్చి నాటికి దేశంలో మావోయిస్టుల అంతం తధ్యమని అన్నారు. మావోయిస్టులలో తుపాకీ వీడి జనంలోకి వచ్చే వారికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందనీ, బుల్లెట్ ను నమ్ముకుంటే ప్రాణాలు తీసుకోవడం మినహా మీరు సాధించేదేమీ లేదనీ, బ్యాలెట్ను నమ్ముకుంటే అధికారంలోకి రాగలమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :