తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam), కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు కీలక లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు(Polavaram – Banakacherla Project)పై అనుమతులు మంజూరు చేయవద్దని కోరారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు నష్టపోతాయని అభిప్రాయపడిన ఆయన, కేంద్రం తక్షణం జోక్యం చేసుకుని ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
EAC భేటీలో ప్రతిపాదనలు తిరస్కరించండి
రేపు జరగనున్న పర్యావరణ అంచనా కమిటీ (EAC) సమావేశంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను తిరస్కరించాలని ఉత్తమ్ లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టుపై సరైన అధ్యయనం లేకుండానే ముందుకు వెళ్లడం అవాంఛనీయమని, ఇది తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటుంది అన్నారు. ఇప్పటి వరకు కేంద్ర జల సంఘం (CWC) నుంచి కూడా ఎలాంటి అనుమతులు లభించలేదని పేర్కొన్నారు.
ట్రైబ్యునల్ నిబంధనలకు విరుద్ధం
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు గోదావరి ట్రైబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు ద్వారా అదనంగా నీరు మళ్లించాలన్న యత్నం గోదావరి నీటి హక్కులపై అన్యాయం చేస్తుందని అన్నారు. తెలంగాణ హక్కులను కాపాడటమే లక్ష్యంగా కేంద్రం, సంబంధిత శాఖలు ఏపీ ప్రతిపాదనలపై ఎలాంటి అంచనాకు రాకుండా తగిన నిర్ణయం తీసుకోవాలి అని స్పష్టంగా పేర్కొన్నారు.
Read Also : Saudi Prince : 20 ఏళ్లుగా కోమాలో ఉన్న సౌదీ యువరాజు లేచారా?