हिन्दी | Epaper

District Collector: ఆ జిల్లా పాఠశాల హెడ్మాస్టార్ సస్పెండ్.. ఎందుకంటే?

Saritha
District Collector: ఆ జిల్లా పాఠశాల హెడ్మాస్టార్ సస్పెండ్.. ఎందుకంటే?

మున్సిపల్ ఎన్నికల విధులకు హాజరుకాకుండా నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆర్మూర్ జెడ్పీ మహిళా హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు వనజా రెడ్డిపై వేటు పడింది. (District Collector) ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైనందుకు గాను ఆమెను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల (elections) నిర్వహణలో భాగంగా వనజా రెడ్డికి ఆర్మూర్‌లోని 4, 5, 6 వార్డులకు రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు అప్పగించారు.

District Collector: ఆ జిల్లా పాఠశాల హెడ్మాస్టార్ సస్పెండ్.. ఎందుకంటే?

ఎన్నికల వంటి అత్యంత కీలకమైన సమయంలో అధికారుల అనుమతి తీసుకోకుండా ఆమె విధులకు రాలేదు. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్రంగా పరిగణించారు. ఎన్నికల విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ.. వనజా రెడ్డిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.

Read Also: Medaram: భక్తులకు గుడ్ న్యూస్.. అక్కడి నుంచి అందరికీ ఉచిత బస్సులు

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. (District Collector) క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కమిషనర్లను ఆదేశించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, మున్సిపల్ కమిషనర్లు ఈ పర్యవేక్షణలో పాల్గొన్నారు. ఎన్నికల విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వనజా రెడ్డిపై తీసుకున్న తరహాలోనే కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!

ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

📢 For Advertisement Booking: 98481 12870