హైదరాబాద్ Devotion : తిలక్ నగర్ లో నాలుగు కోట్లకి పైగా విలువ చేసే ఇంటిని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహాస్వామికి విరాళంగా అందజేశారు. చిక్కడపల్లిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో దేవుడి పేరు మీదకు యాదగిరిగుట్ట ఇఒ వెంకటరావు సమక్షంలో ఆ భవంతిని ట్రాన్స్ ఫర్ చేశారు. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి ముత్తినేని వెంకటేశ్వర్లు, తిలక్ నగర్ లోని తన సొంత ప్రాపర్టీ 152 గజాలలో నిర్మితమైన జీ+3, పెంట్ హౌస్ కలిపి ఉన్న ఇల్లు దేవస్థానానికి అందజేశారు.
రిజిస్ట్రేషన్ కార్యక్రమం
రిజిస్ట్రేషన్ అనంతరం సంబంధిత డాక్యుమెంట్లను ఆయన, ఈవో వెంటకరావుకి, టెంపుల్ చైర్మన్ నరసింహమూర్తి, దేవస్థాన అధికారుల సమక్షంలో దేవస్థానానికి అందజేశారు. ఈ సందర్భంగా ఈవో వెంకటరావు, దాత వెంకటేశ్వర్లును స్వామివారి కండువాతో సన్మానం చేసి, స్వామివారి ప్రసాదం అందజేశారు. లక్ష్మీనరసింహ స్వామి మీద భక్తితో విలువైన property ని ట్రాన్స్ ఫర్ చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పుడైనా టెంపుల్ వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందవచ్చని ఆయనకు హామీ ఇచ్చారు.
అభినందనలు మరియు ఆశీస్సులు
దాత ముత్తినేని వెంకటేశ్వర్లుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha), ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామాయ్యర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని ఈవో వెంకటరావు స్పష్టం చేశారు. ఈ దానం ఆలయ అభివృద్ధికి దోహదం చేస్తుందని, భక్తులకు స్ఫూర్తి కలిగిస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.
ముత్తినేని వెంకటేశ్వర్లు విరాళంగా ఇచ్చిన ఆస్తి విలువ ఎంత?
ఆ ఆస్తి విలువ నాలుగు కోట్ల రూపాయలకు పైగానే ఉంది.
ఈ ఆస్తిని ఎవరి పేరుతో రిజిస్టర్ చేశారు?
ఆ ఆస్తిని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పేరుతో రిజిస్టర్ చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Read also :