Delhi : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సభకు మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు మక్కాన్, విజయరమణారావు హాజరుకాకపోవడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ స్పందిస్తూ మంత్రి శ్రీధర్ బాబుకు వ్యంగ్యంగా లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల తమ విశాఖ ట్రస్టు కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసిన విషయాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడంలో అందరికీ ఒకే నిబంధన ఉండాలని, మరి ఢిల్లీలో జరిగిన కీలక సభకు గైర్హాజరైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Read Also : జలమండలి కీలక ప్రకటన.. నవంబర్ 3, 4 తేదీల్లో ఈ ప్రాంతాలకు నీళ్లు రావు!

అందరికీ ఒకే రూల్ ఉండాలి.. ఎమ్మెల్యేలకు మినహాయింపు ఎందుకు?
వంశీకృష్ణ తన లేఖలో మరింత వ్యంగ్యంగా స్పందిస్తూ.. ఢిల్లీ సభకు హాజరుకాకపోవడం కూడా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ ఒక్కసారికి ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చర్యల నుంచి మినహాయించాలని శ్రీధర్ బాబును కోరడం ద్వారా తన అసంతృప్తిని పరోక్షంగా వ్యక్తం చేశారు. గతంలో విశాఖ ట్రస్టు కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలపై చర్యలు తీసుకున్నప్పుడు, ఇప్పుడు ప్రజాప్రతినిధుల విషయంలో కూడా అదే నిబంధన అమలు చేయాలనే సందేశాన్ని ఆయన ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం తెలంగాణ కాంగ్రెస్‌లో పార్టీ క్రమశిక్షణ, నాయకుల మధ్య సమన్వయం, కార్యకర్తలు–ప్రజాప్రతినిధులకు వేర్వేరు నిబంధనలు ఉన్నాయా? అనే చర్చకు దారితీసింది. మంత్రి, ఎంపీ మధ్య ఈ లేఖాస్త్రం రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో ఆసక్తికరంగా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :