Delhi liquor policy : . సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కే. కవితతో పాటు మరికొందరికి ఇచ్చిన విముక్తిని సవాల్ చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
ట్రయల్ కోర్టు తీర్పుపై ఈడీ అప్పీల్
రౌజ్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు నిందితులందరినీ డిశ్చార్జ్ చేస్తూ ఇచ్చిన తీర్పును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సవాల్ చేసింది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు విచారణ ప్రారంభించింది.
Read Also: Sakala Janula Samme: కేసీఆర్, కేటీఆర్‌పై నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

ట్రయల్ కోర్టు వ్యాఖ్యలపై స్టే
ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. అలాగే ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.
కోర్టులో ఈడీ వాదనలు
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో వాదిస్తూ, ఢిల్లీ మద్యం కేసు దేశ రాజధానిలో జరిగిన అతిపెద్ద అవినీతి కేసుల్లో ఒకటని తెలిపారు. నిందితులు మద్యం విధానంలో తమకు అనుకూలంగా నిబంధనలు చేర్చేందుకు భారీ మొత్తంలో లంచాలు ఇచ్చారని ఆరోపించారు.
సీబీఐ సమర్పించిన సాక్ష్యాధారాలను ట్రయల్ కోర్టు సరిగా పరిగణలోకి తీసుకోలేదని ఆయన వాదించారు. ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ఈడీ హైకోర్టును కోరింది.
hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: