हिन्दी | Epaper

Adulterated Toddy: కల్తీ కల్లు ఘటనలో ఆరుగురికి చేరిన మృతుల సంఖ్య

Sudheer
Adulterated Toddy: కల్తీ కల్లు ఘటనలో ఆరుగురికి చేరిన మృతుల సంఖ్య

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో కల్తీ కల్లు (Adulterated Toddy) కారణంగా మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 43 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులలో చాలామందికి కిడ్నీ సమస్యలు తలెత్తగా, కొందరికి డయాలసిస్ అవసరమవుతోంది. నిమ్స్, గాంధీ సహా ప్రైవేటు ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కల్లు కంపౌండ్‌లలో ఆల్ఫ్రాజోలం వంటి మత్తుమందులు కలిపినట్టు ఆరోపణలున్నాయి.

అధికారుల చర్యలు – దాడులు, అరెస్టులు

ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే అబ్కారీ శాఖ, పోలీసులు కలిసి కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించారు. బాలానగర్, కూకట్‌పల్లి పరిధిలో మొత్తం ఏడుగురు అనుమానితులను అరెస్టు చేశారు. నాలుగు దుకాణాల నుంచి 674 లీటర్ల కల్లు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. 66 గ్రాముల తెలుపు పౌడర్‌ను స్వాధీనం చేసుకుని పరీక్షలకు పంపారు. కొన్ని దుకాణాల్లో ఆల్ఫ్రాజోలం మిశ్రమం ఉండటాన్ని అధికారులు గుర్తించారు. దీంతో పలు దుకాణాల లైసెన్సులు రద్దు చేశారు.

అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు

బాధితులు ఆసుపత్రుల్లో చేరుతున్నా ఆరోగ్యశాఖ అధికారులు స్పందించకపోవడం ప్రజల్లో ఆగ్రహం కలిగిస్తోంది. రెండు రోజులు గడిచినా అధికారులు మొద్దుబారినట్టు వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ఎక్సైజ్ శాఖ కూడా ఘటన తర్వాత మాత్రమే స్పందించిందని ప్రజలు వాపోతున్నారు. ఈ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం అందించాలని, బాధితులకు మెరుగైన వైద్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనల పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Read Also : Mee Seva Services: మీ సేవలో మరో రెండు సేవలు ప్రారంభం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

హైటెక్ అడుగులతో వ్యవసాయానికి స్వర్ణ యుగం

హైటెక్ అడుగులతో వ్యవసాయానికి స్వర్ణ యుగం

చట్టం అందరికీ సమానమేనా?

చట్టం అందరికీ సమానమేనా?

దానం, కడియంలకు భారీ ఊరట.. అనర్హత వేటు నుంచి క్లీన్ చిట్!

దానం, కడియంలకు భారీ ఊరట.. అనర్హత వేటు నుంచి క్లీన్ చిట్!

పతనం అంచున ప్రజారోగ్యం

పతనం అంచున ప్రజారోగ్యం

ఆ రాష్టాలతో పోల్చుకుంటే తెలంగాణ రైతులకే అప్పులు తక్కువ

ఆ రాష్టాలతో పోల్చుకుంటే తెలంగాణ రైతులకే అప్పులు తక్కువ

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

టీ – సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

టీ – సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టును సందర్శించిన NDSA బృందం

పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టును సందర్శించిన NDSA బృందం

ఆ తల్లికి ఎంత కష్టం.. ఆస్తి లాక్కొని అన్నం పెట్టకుండా వేధిస్తున్న కొడుకులు

ఆ తల్లికి ఎంత కష్టం.. ఆస్తి లాక్కొని అన్నం పెట్టకుండా వేధిస్తున్న కొడుకులు

ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదనీ యువకుడు ఆత్మహత్య

ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదనీ యువకుడు ఆత్మహత్య

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్
0:52

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్

📢 For Advertisement Booking: 98481 12870