Cyclone: వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు ప్రజలకు కష్టాలను తెచ్చిపెట్టాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల ప్రభావంతో దాదాపు 115 కాలనీలు నీట మునిగాయి. ఊరచెరువు గండి పడటంతో హన్మకొండ (Hanamkonda) లోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బొంది వాగు ఉధృతంగా ప్రవహించడంతో సమ్మయ్య నగర్, గోకుల్ నగర్, సంతోషిమాత కాలనీ, పరిమళ కాలనీ, కాకతీయ కాలనీ, రాయపుర ప్రాంతాల్లో నీరు చొచ్చుకుపోయింది. హన్మకొండ హంటర్ రోడ్‌లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పూర్తిగా నీట మునిగిపోవడంతో 200 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. రెస్క్యూ బృందాలు వెంటనే రంగంలోకి దిగి విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలించాయి.
Read also: Rain Alert : ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Cyclone: వరంగల్ నగరంలోని రహదారులు, వంతెనలు నీట మునిగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎన్‌డిఆర్ఎఫ్, ఎస్డిఆర్‌ఎఫ్, డీఆర్‌ఎఫ్ బృందాలు బోట్ల సహాయంతో సహాయక చర్యలు చేపడుతున్నాయి. బీరన్నకుంట పాఠశాల, ఎనుమాముల మార్కెట్, ఆరేపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం, కొత్తవాడలోని లక్ష్మీ గార్డెన్‌లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్లు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య పర్యటించి ముంపు బాధితులను పరామర్శించారు. నగరంలోని కరీంనగర్, హైదరాబాద్ రహదారులు కూడా నీటమునిగిపోవడంతో వరంగల్ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రస్తుతం వర్షం తగ్గడంతో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: