అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసుల సూచన
హైదరాబాద్ : సైబర్ నేరగాళ్ల బరితెగింపు కొత్తరూపం సంతరించుకుంది. ఇప్పటి వరకు ట్రేడింగ్, డిజిటల్ అరెస్టు, మా ్యట్రమోనియల్ వంటి నేరాలతో అమాయకులను నిండా ముంచిన నేరగాళ్లు ఇప్పుడు(Cybercrime) ఆర్బిఐ కొత్తగా ప్రవేశపెట్టిన ఉద్గం పథకాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని మోసాలకు దిగసాగారు. ఈ మోసాలను ఓసారి పరిశీలిస్తే దేశ వ్యాప్తంగా కోట్లాది మంది తమ బ్యాంకులోని ఖాతాలలో చిన్న మొత్తాలను అలాగే వదిలేసి ఖాతాలను నిర్వహించడం లేదు. ఇలాంటి ఖాతాలు కోట్ల సంఖ్యలో వున్నట్లు దీనివల్ల 30 వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో నిర్వహణ లేకుండా వున్నట్లు ఆర్బిఐ ప్రకటించింది. బ్యాంకుల ఖాతాలతో పాటు చిన్నా చితక ఎఫ్తాలు. డెవిడెండ్లు, ఫేర్లు, మ్యూవల్స్ ఫండ్స్ కూడా లక్షల సంఖ్యలో వుండి పోయాయి. ఏళ్ల తరబడి వీటి నిర్వహణ చూడని ఖాతాదారులు వాటిని వెంటనే మూసివేయడం లేదా సవ్యంగా నిర్వహించి అందులోని డబ్బులను తీసుకోవాలని ఆర్బిఐ కోరింది. ఇందు కోసం ఉద్గం పేరిట ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. మీ ధనం… మీ హక్కు పేరిట ఆర్థిక శాఖ ఈ పథకం అమలు చేసింది.
Read also: BRS: ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్య ఖూనీ: కేటీఆర్

లింకులు క్లిక్ చేస్తే ఖాతాలు ఖాళీ
ఈ పథకం(Cybercrime) వచ్చే ఏడాది సెప్టెంబరు 30వ తేదీ వరకు వుంటుంది. రెండు నుంచి పదేళ్ల వరకు నిర్వహణలో లేని ఖాతాల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ పథకాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆర్బిఐ పేరిట ఎస్ఎం ఎస్లు లేదా లింకులు పంపుతూ అనేక మందిని మోసం చేస్తున్నారు. నిర్వహణ చూడని ఖాతాదారులు వీటిని పట్టించుకోవడం లేదు. బ్యాంకు ఖాతాలు కలిగి నిర్వహణ చూడని వారు తమకు వచ్చిన మెసేజ్లు, లింకులు నిజమైనవి గా భావిస్తూ సైబర్ నేరగాళ్ల లింకులను ఓపెన్ చేస్తే అంతే సంగతులు. ఇలా లింకులను క్లిక్ చేసిన ఢిల్లీ, హరియాణా, తమిళనాడుకు(Tamil Nadu) చెందిన కొందరు తమ బ్యాంకుల్లో వున్న లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు. ఐడి, పాస్ వర్డ్లు, ఓటిపిలు పంపుతూ నిమిషాల వ్యవధిలో ఖా తాలను ఈ నేరగాళ్లు ఖాళీ చేస్తున్నారు. ఈ తరహా మోసాలపట్ల అందరు అప్రమత్తంగా వుండాలని, ఫోన్లలో వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని, ఓటిటిలు, పాస్ వర్డ్లు ఎవరికీ చెప్పవద్దన సైబర్ క్రైం పోర్టల్ అధికారులు, సైబర్ క్రైం పోలీసులుకోరుతున్నారు. ఎలాంటి అను మానం వున్నా 1930 లేదా సమీప పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారు కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: