Crime: కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్(Swan) లేక్ అపార్ట్‌మెంట్‌లో ఒక దారుణమైన హత్య జరిగింది. రేణు అగర్వాల్ (50) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు కాళ్లు చేతులు కట్టేసి, కత్తితో పొడిచి గొంతు కోసి చంపారు. కుటుంబ సభ్యుల సమాచారంతో బాలానగర్(Balanagar) డీసీపీ సురేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల దర్యాప్తు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రేణు అగర్వాల్(Renu Agarwal) తన భర్త, కుమారుడితో కలిసి స్వాన్ లేక్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఆమె భర్త, కుమారుడు వ్యాపార పనిమీద షాపుకు వెళ్లారు. సాయంత్రం 5 గంటలకు వారు రేణుకు ఫోన్ చేయగా, ఆమె స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి ఇంటికి తిరిగివచ్చి చూడగా, తలుపుకు తాళం వేసి ఉంది. ఎంత పిలిచినా పలకకపోవడంతో ప్లంబర్ సహాయంతో బాల్కనీ నుండి లోపలికి వెళ్లి చూడగా, రేణు రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది.
దుండగులు ఆమె కాళ్లు చేతులు కట్టేసి, సిజర్, చాకుతో శరీరంపై పలుచోట్ల గాయపరచి, గొంతు కోసి చంపినట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారి ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తే ఈ హత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ దారుణం ఎక్కడ జరిగింది?
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్ లేక్ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
హత్యకు గురైన మహిళ ఎవరు?
రేణు అగర్వాల్ (50) అనే మహిళను హత్య చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: