పెళ్లంటే ఇద్దరు వ్యక్తులు ఓ స్త్రీ..ఓ పురుషుడు జీవితాంతం కలిసి జీవించేందుకు చేసుకునే ఒప్పందం. అది ఒప్పందం మాత్రమే కాదు.. ఆనందంగా మనసైన తోడుతో జీవించడం కంటే మరొక ధన్యకర మైనది ఏదీ లేదు కదా! ఒకప్పుడు భర్త ఎంత దుర్మార్గుడైనా భార్య భరించేది. భార్య ఎంత గయ్యాలిదైనా భర్త భరించేవాడు. కానీ నేడు చిన్నకారణాలకే విడిపోతున్నారు. వంట సరిగ్గా రాదని, అందంగా లేదని, డబ్బు చాలినంతగా ఇవ్వలేదని, ఉద్యోగం లేదని ఇలా సర్దుకునుపోయే గుణం లేక పెళ్లిళ్లు పేటాకులవుతున్నాయి..
Read Also: Jagadish Reddy: “అలా మాట్లాడే వాళ్లు ఉప ముఖ్యమంత్రులా?

మనస్తాపానికి గురైన వధువు
నువ్వు నాకు అక్కర్లేదు అక్కడే చావు అంటూ దూషించడంతో, మనస్తాపానికి గురైన నవవధువు ఆత్మహత్యకు (Crime) పాల్పడింది. వికారాబాద్ జిల్లా (Vikarabad District) పరిగి మండలం మలెలమోనిగూడెం గ్రామానికి చెందిన శివలింగం అనే వ్యక్తితో, దరూర్ మండలం గడ్డమీద గంగారం గ్రామానికి చెందిన శిరీస (21) వివాహం చేశారు కుటుంబ సభ్యులు. అయితే భార్య వంట సరిగ్గా చేయడం లేదని, తనకంటే తక్కువగా చదువుకుందని తరచూ భార్యను వేధించడం మొదలుపట్టాడు భర్త.
భర్త వేధింపులతో విసిగిపోయి శిరీష భర్తపై తిరగబడింది. దీంతో ఆమెను పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోయాడు భర్త. తర్వాత రోజు భార్య ఫోన్ చేయగా నువ్వు నాకు అక్కర్లేదు అక్కడే చావు అని భర్త శివలింగం దూషించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శీరిష ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తమ కూతురు చావుకు అల్లుడే కారణమని, అతడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: